ప్యారడైజ్ లో మహానటి ఐటెంసాంగ్..
ABN, Publish Date - Jul 28 , 2026 | 05:39 PM
ఈ మధ్య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఒక హాట్ ట్రెండ్‌గా మారిపోయింది. అగ్ర కథానాయకుల సినిమాల్లో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల ఆ పాటలకి, సినిమాలకి ఎక్కడలేని ప్రత్యేక క్రేజ్, హైప్ లభిస్తున్నాయి.
ఈ మధ్య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేయడం ఒక హాట్ ట్రెండ్‌గా మారిపోయింది. అగ్ర కథానాయకుల సినిమాల్లో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల ఆ పాటలకి, సినిమాలకి ఎక్కడలేని ప్రత్యేక క్రేజ్, హైప్ లభిస్తున్నాయి. అందుకే స్టార్ హోదా ఉన్నప్పటికీ, కేవలం ఒకే ఒక్క పాటలో కనిపించడానికి భామలు అస్సలు వెనుకాడటం లేదు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సమంత, కాజల్, తమన్నా, శృతి హాసన్, పూజా హెగ్డే, శ్రీలీల అందరూ ఏదో ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఊపేసినవారే. ఇప్పుడు ఆ క్రేజీ లిస్ట్‌లోకి మహానటి కీర్తి సురేష్ కూడా చేరిపోవడం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా మారింది.
దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఊరమాస్ స్పెషల్ సాంగ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రేజీ ఐటమ్ నంబర్ కోసం శ్రీకాంత్ ఓదెల మరెవరినో కాకుండా దసరాలో వెన్నెలగా ఆకట్టుకున్న కీర్తి సురేష్‌నే ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా కీర్తికి ఆశించిన హిట్ దక్కడం లేదు. దీంతో హైప్ తెచ్చుకోవడానికి కీర్తి కూడా ఈ ఐటెమ్ సాంగ్ కి ఒప్పుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండటంతో, ఈ స్పెషల్ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. గతంలో దసరాలో నాని - కీర్తి సురేష్ కాంబినేషన్ తెచ్చిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎంతో పెద్ద విజయాన్ని అందించింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో, అది కూడా అనిరుధ్ మాస్ బీట్స్‌కి ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తే థియేటర్లలో ఈలలు, గోలలు ఖాయమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఐటెమ్ సాంగ్ కీర్తికి కలిసొస్తుందా అనేది తెలియాలి అంటే ప్యారడైజ్ రిలీజ్ అయ్యేవరకు ఆగాలి.