సత్యవాన్ సావిత్రి వచ్చేది ఎప్పుడంటే...
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:47 PM
ఈ ఏడాది వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న కీర్తి సురేశ్ నటించిన ‘సత్యవాన్ సావిత్రి’ నవంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా సెకండ్ సింగిల్ నవంబర్ 3న విడుదల కానుంది.
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ ఈ యేడాది వైవిద్యభరితమైన పాత్రలతో అలరిస్తోంది. నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్'లో ఐటమ్ సాంగ్‌లో నర్తించిన కీర్తి సురేశ్, ఆ తర్వాత తమిళ చిత్రం 'డోరతి' లో ప్రాధాన్యమున్న పాత్రను చేసింది. నిడివి తక్కువే అయినా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇక తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'అక్క' వెబ్ సీరిస్‌లో సీనియర్ నటి రాధికా ఆప్టేతో కలిసి కీర్తి సురేశ్ స్క్రీన్ షేర్ చేసుకుంది. యశ్ రాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ వెబ్ సీరిస్ ను ధర్మరాజ్ శెట్టి డైరెక్ట్ చేశారు. ఇందులో భవానీగా నటించింది కీర్తి సురేశ్. ఇక ఆమె లాయర్ పాత్రను పోషించిన 'సత్యవాన్ సావిత్రి' సినిమా నవంబర్ 20వ తేదీ విడుదల కాబోతోంది.
విశేషం ఏమంటే 'సత్యవాన్ సావిత్రి' పేరుతో గతంలో కమల్ హాసన్, శ్రీదేవి 1977లో ఓ మలయాళ చిత్రంలో నటించారు. అది అదే పేరుతో తమిళంలో డబ్ అయ్యింది. అలానే 'సత్యవంతుడు' పేరుతో తెలుగులో విడుదలైంది. ఇప్పుడు 'సత్యవాన్ సావిత్రి' పేరుతో కీర్తి సురేశ్ నటిస్తోంది మాత్రం సోషల్ మూవీనే. ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిస్కిన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ నవంబర్ 3న రాబోతోంది.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోలూ.. సూర్య, ధనుష్‌లను చూసి నేర్చుకోండయ్యా..
King: ‘కింగ్’.. ఫస్ట్ సాంగ్.. చూసేయండి
డ్రాగన్' కోసం 'ధురంధర్' మ్యూజిక్ డైరెక్టర్