Immortal: రెండు వారాల ఆలస్యంగా తెలుగులో...
ABN, Publish Date - Sep 14 , 2026 | 06:22 PM
కయాదు లోహర్ అంగీకరించిన తొలి తమిళ చిత్రం 'ఇమ్మోర్టల్' ఈ నెల 19న తెలుగులో రాబోతోంది. తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీ బిజీ. జూలై 30 నుంచి సెప్టెంబర్ 10లోపు అతను సంగీతం అందించిన ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో 'శ్రీనివాస మంగాపురం, ఇరుముడి' తెలుగు సినిమాలు కాగా 'మకుటం, విశ్వనాథ్ అండ్ సన్స్, మండాడి' తమిళ చిత్రాలు. ఇవి కూడా తెలుగులో డబ్ అయ్యాయి. అయితే జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించకుండా కేవలం హీరోగా నటించిన సినిమా 'ఇమ్మోర్టల్'. ఇది తమిళంలో ఇదే నెల 4న విడుదలైంది. అయితే అప్పట్లో దీనిని అదే రోజున తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ అనుకున్న విధంగా అది తెలుగులో రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు రెండు వారాల గ్యాప్ తర్వాత ఇమ్మోర్టల్ తెలుగు వర్షన్ ఈ నెల 19న జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే... ఇవాళ పలు భాషా చిత్రాలలో నాయికగా నటిస్తున్న కయాదు లోహర్ అంగీకరించిన తొలి తమిళ చిత్రం ఇది. కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో జరిగిన జాప్యం కారణంగా కయాదు లోహర్ తొలి తమిళ చిత్రంగా 'డ్రాగన్' జనం ముందుకు వచ్చింది.
సెప్టెంబర్ 4న తమిళంలో విడుదలైన 'ఇమ్మోర్టల్' మూవీకి మిశ్రమ స్పందన లభించింది. పురాణగాథ ఆధారంగా వేల సంవత్సరాల క్రితం మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. ఇందులో మధ్యతరగతి కుర్రాడు మ్యాగీగా జీవీ ప్రకాశ్ కుమార్ నటించగా, అతనితో హౌస్ షేర్ చేసుకునే అందాల భామ సింధుగా కయాదు లోహర్ నటించింది. నటన పరంగా ఇద్దరికీ మంచి పేరే వచ్చినా... ఈ ఫాంటసీ, హారర్, రొమాన్స్, సర్వైవల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడంలో దర్శకుడు మారియప్పన్ చిన్నా సఫలం కాలేకపోయాడు. ఈ మధ్య కాలంలో జీవీ ప్రకాశ్ నటించిన తమిళ అనువాద చిత్రాలకు తెలుగులోనూ పెద్దంత స్పందన లభించలేదు. మరి 'ఇమ్మోర్టల్'ను తెలుగు వారు ఏ రీతిన ఆదరిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Sydney Sweeney: నగ్నంగా స్పోర్ట్స్ యాడ్.. సిగ్గులేదా.. ఆడవారి పరువు తీసావ్
Amitabh Bachchan: జయా బచ్చన్‌కు అసలు టైమ్ చెప్పని అమితాబ్.. బిగ్‌బీ ఫన్నీ ట్రిక్ ఇదే!
మంగళ గౌరి.. డ్రాగన్ పాప లేడీ ఓరియెంటెడ్ సినిమా మొదలెట్టేసింది