విపరీతంగా.. నవ్విస్తుంది

ABN , Publish Date - Feb 12 , 2026 | 08:47 AM

. థియేటర్లకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ‘ఫంకీ’ విపరీతంగా నవ్విస్తుంది. అందరినీ అలరించి ఘన విజయం సాధిస్తుంది’ అని విశ్వ‌క్ సేన్‌ అన్నారు.

Funky

నా ప్రతీ సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్‌ ఉంటుంది. కానీ ‘ఫంకీ’ విడుదలకు ముందు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ సినిమాను మీరంతా బాగా ఎంజాయ్‌ చేస్తారు. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇంత అద్భుతమైన కథ నా దగ్గరకు వచ్చింది. థియేటర్లకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ‘ఫంకీ’ విపరీతంగా నవ్విస్తుంది. అందరినీ అలరించి ఘన విజయం సాధిస్తుంది’ అని విశ్వ‌క్ సేన్‌ అన్నారు.

ఆయన కథానాయకుడిగా అనుదీప్‌ కేవీ తెరకెక్కించిన చిత్రం ‘ఫంకీ’. సితార ఎంటర్టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అనుదీప్‌ కేవీ మాట్లాడుతూ ‘ఫంకీ’ పూర్తిస్థాయి కుటుంబ చిత్రం. ప్రారంభం నుంచి చివరి వరకూ వినోదాత్మకంగా ఉంటుంది’ అని చెప్పారు. ‘ఫంకీ’ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో నేను పోషించిన చిత్ర పాత్రపై ప్రేమ కురిపిస్తారని కోరుకుంటున్నాను’ అని చిత్ర కథానాయిక కయాదు లోహర్‌ తెలిపారు. చివ‌ర‌లో జై ఎన్టీఆర్ అంటూ అక్క‌డికి వ‌చ్చిన వారిలో జోష్ నింపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 12 , 2026 | 10:41 AM