సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కయాదు.. ఆశలన్నీ ప్యారడైజ్ పైనే

ABN, Publish Date - Sep 14 , 2026 | 01:06 PM

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మలలో కయాదు లోహర్ (Kayadu Lohar) ఒకరు. గ్లామర్, నటన పరంగా మంచి మార్కులే సాధిస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రం ఈ భామకు అందని ద్రాక్షలానే ఊరిస్తోంది.

Kayadu Lohar

ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మలలో కయాదు లోహర్ (Kayadu Lohar) ఒకరు. గ్లామర్, నటన పరంగా మంచి మార్కులే సాధిస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రం ఈ భామకు అందని ద్రాక్షలానే ఊరిస్తోంది. శ్రీవిష్ణు సరసన చేసిన అల్లూరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కయాదు, ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇక దాని తరువాత ఇతర క్రేజీ ప్రాజెక్టుల్లో కనిపించింది. వీటితో పాటు ఇతర భాషల చిత్రాలలో కూడా నటించినప్పటికీ, ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. సరైన హిట్టు పడకపోవడంతో ఆఫర్లు వస్తున్నా స్టార్ లీగ్‌లోకి అడుగుపెట్టలేకపోతోంది.


ఇలాంటి సమయంలో ఈ బ్యూటీకి గోల్డెన్ ఆఫర్ తగిలింది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. సుబ్బలక్ష్మీ అనే కీలక పాత్రలో ఆమె కనిపించనుంది. గతంలో నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎపిక్‌లో నటించే అవకాశం రావడం కయాదు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా మారింది.


ది ప్యారడైజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి కేవలం మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, మిగిలిన పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో చిత్ర బృందం కీలక దశలోకి అడుగుపెట్టింది. తాజా సమాచారం ప్రకారం, అనిరుధ్ రవిచందర్ సంగీతానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల కోసం చిత్ర బృందం సెన్సార్ కాపీతో చెన్నైకి వెళ్తోంది. ఈ పాన్-ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే కయాదు లోహర్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడం ఖాయం. ది ప్యారడైజ్ కనుక ఊహించిన స్థాయిలో హిట్ అయితే, ఆమెకు రాబోయే రోజుల్లో టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయిలో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ అవకాశాలు క్యూ కడతాయి. అందుకే కయాదు కూడా ప్రస్తుతం తన ఆశలన్నీ ఈ భారీ ప్రాజెక్ట్ మీదనే పెట్టుకుంది. మరి ఈ ప్యారడైజ్ సినిమా కయాదు జాతకాన్ని మార్చి గోల్డెన్ స్టార్‌గా మారుస్తుందో లేదో వేచి చూడాలి.

Updated Date - Sep 14 , 2026 | 01:06 PM