సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుబ్బలక్ష్మి.. వెండితెర పై వెలగని తార..

ABN, Publish Date - Apr 11 , 2026 | 03:20 PM

నాని హీరోగా నటిస్తున్న‘ది ప్యారడైజ్‌’ చిత్రం నుంచి హీరోయిన్  కయాదు లోహర్‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

నాని హీరోగా నటిస్తున్న‘ది ప్యారడైజ్‌’(The Paradise)చిత్రం నుంచి హీరోయిన్  కయాదు లోహర్‌ (kayadu lohar) ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా కొత్త  పోస్టర్‌తో చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కయాదు సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నట్లు  మేకర్స్  వెల్లడించారు. 

‘వెండితెరపై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని (Kayadu Lohar) చూడండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కయాదు లుక్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరిదశలో ఉంది. ఆగస్టు 21న సినిమాను విడుదల చేయనున్నారు. ‘దసరా’ సినిమా ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. నాని ‘జడల్‌’ (Jadal) పాత్రలో కనిపించనున్నారు. మోహన్‌బాబు విలన్‌గా ‘శికంజ మాలిక్‌’ పాత్రలో నటిస్తున్నారు. 

Updated Date - Apr 11 , 2026 | 03:21 PM