సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తెలుగులో అవకాశాలు ఫుల్‌... తమిళంలో నిల్‌

ABN, Publish Date - Mar 26 , 2026 | 09:10 AM

‘డ్రాగన్‌’ వంటి హిట్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన యంగ్‌ హీరోయిన్‌ కయదు లొహర్‌ తెలుగు, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించు కుంటున్నారు.

‘డ్రాగన్‌’ (Dragon) వంటి హిట్‌ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన యంగ్‌ హీరోయిన్‌ కయదు లొహర్‌ (Kayadu lohar) తెలుగు, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించు కుంటున్నారు. కానీ, తమిళంలో మాత్రం అవకాశాలు రావడం లేదు. ‘డ్రాగన్‌’ (dragon) తర్వాత  పలు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోయాయి. అయినప్పటికీ ఆమె మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇపుడు స్టార్‌ హీరో శింబు సరసన ఓ చిత్రంలో నటించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.

నిజానికి ఇతర భాషల కంటే తమిళంలో అధిక చిత్రాల్లో నటించి నిలదొక్కుకోవాలని కయదు భావిస్తున్నారు. కానీ, ఆమెపై వస్తున్న ట్రోల్స్‌, రూమర్లు కారణంగా వచ్చిన అవకాశాలు చేజారి పోతున్నాయి. అయినప్పటికీ ఆమె ఏమాత్రం నిరుత్సాహ పడకుండా, రాష్ట్రంలో పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు హాజరవుతూ సినిమాల్లో ఇచ్చే పారితోషికం కంటే భారీ మొత్తంలో సంపాదిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు, సినిమా అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారామె!

Updated Date - Mar 26 , 2026 | 12:04 PM