Rajinikanth: బాబోయ్.. ఆ స్పీడ్‌ ఏంటి తలైవా

ABN , Publish Date - Aug 13 , 2026 | 05:50 PM

వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.

Super Star Rajinikanth

వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని చాలామంది అంటుంటారు. కానీ, దానిని ప్రాక్టికల్‌గా నిరూపించి చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth). ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న తలైవా వేగం చూస్తుంటే.. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా కుర్ర హీరోలందరికీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ ఏజ్‌లో ఆ స్పీడ్ ఏంటి తలైవా.. అంటూ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలనే క్లియర్ టార్గెట్‌తో దూసుకుపోతున్నారు రజనీకాంత్. గతేడాది ఆయన కథానాయకుడిగా వచ్చిన ‘కూలీ’ (Coolie) సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ.. టాక్ విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలనే సాధించింది. అయితే, ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా సరే, తలైవా రేంజ్, మేనియా మాత్రం తగ్గలేదని బాక్సాఫీస్ నంబర్స్ స్పష్టం చేశాయి.


ఇక ‘కూలీ’ తర్వాత అభిమానుల చూపు మొత్తం ‘జైలర్ 2’ (Jailer 2) పైనే ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ సీక్వెల్ ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. మొదటి భాగం సృష్టించిన సునామీతో పోలిస్తే.. పార్ట్-2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రజనీకాంత్ మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు అనిరుధ్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక్కడితోనే రజనీ వేగం ఆగలేదు. ‘జైలర్ 2’ రిలీజ్ కాకముందే మరొక క్రేజీ ప్రాజెక్ట్‌ను జెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఓ మై కడవులే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో ‘ధర్మన్’ (Dharman) అనే చిత్రం తెరకెక్కుతోంది. విశ్వనటుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి.


జూన్‌ నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్‌ భారీ స్థాయిలో జరిగింది. ఆ వెంటనే సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ మొదలుపెట్టడం, దాన్ని పూర్తి చేయడం రెండూ జరిగిపోయాయి. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ను కూడా సూపర్ స్పీడ్‌లో మొదలుపెట్టేశారు. అంతేకాదు, తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రోమో రజనీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తలైవా ఒక డెడ్లీ డాక్టర్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. అనిరుధ్ ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ మాస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, తలైవా లుక్ చూస్తుంటే.. అభిమానులకు ఈ సినిమాతో ఫుల్ మీల్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు సీనియర్ నటి సిమ్రాన్, గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా అలాగే కమెడియన్ యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందో చూడాలి.

ఇవి చదవండి:

ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. హెల్త్ బులిటెన్‌ విడుదల

కృష్ణ కొడుకుతో సినిమా తీసినా.. ఎన్టీఆర్‌ని ఏమైనా అంటే నేనే కొడతా: MS రాజు

బాక్సాఫీస్‌ పోరులో ‘సాహో’ జోడీ.. విన్నర్ ఎవరు?

Updated Date - Aug 13 , 2026 | 06:13 PM