సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కీరవాణి కోడలు కాబోతున్న బలగం హీరోయిన్.. కాలభైరవతో పెళ్లి ఫిక్స్

ABN, Publish Date - Aug 31 , 2026 | 03:58 PM

బలగం’, ‘మసూద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్ రామ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Kavya Kalyanram

‘బలగం’, ‘మసూద’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ని మొదలుపెట్టి.. హీరోయిన్ గా మారిన కావ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గత కొన్నేళ్లుగా కావ్య.. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ప్రస్తుతం సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు పుకార్లు వచ్చాయి. అనేక బహిరంగ కార్యక్రమాలు, ఫంక్షన్లలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.


తాజాగా ఈ జంట తమ రిలేషన్‌షిప్‌పై స్పష్టతనిచ్చారు. తామిద్దరం ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. కావ్య కళ్యాణ్ రామ్.. కాలభైరవతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ 'కొందరు మన జీవితంలోకి వచ్చి, మనం దేవుడికి అత్యంత ప్రియమైన బిడ్డలమేమో అనే భావనను కలిగిస్తారు. సరిగ్గా మనకు తగిన సరైన వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు, గులాబీ రంగు అద్దాల ద్వారా ప్రపంచాన్ని చూడటం అంత చెడు విషయమేమీ కాదనిపిస్తుంది. నేను వద్దు అని చెప్పినప్పటికీ, నాకు డైట్ కోక్ మాత్రమే కావాలని గ్రహించే నువ్వు.. ఇలాగే మరిన్ని ఏళ్ళు నన్ను అర్థం చేసుకుంటూ నాతో ఉండాలి' అని చెప్పుకొచ్చింది. ప్రతీరోజూ ఎంతో సాధారణంగా సాగిపోయే క్షణాలను కూడా వెలిగించి, తనను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతమైన అమ్మాయిగా భావించేలా చేస్తున్నందుకు ఈ ప్రత్యేక వ్యక్తికి ధన్యవాదాలు అంటూ తెలిపింది.


ప్రస్తుతం ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ జంటకు పెద్ద ఎత్తున కామెంట్స్ రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరి ప్రేమకి, పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఆమోదం తెలిపారని, త్వరలోనే వివాహ నిశ్చితార్థం, పెళ్లి తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఏదిఏమైనా కావ్య కళ్యాణ్ రామ్.. కీరవాణి కోడలు కావడం ఆమె అదృష్టమని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 04:12 PM