సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్‌పై.. కావేరి సంచ‌ల‌న‌ కామెంట్స్! వీడియో.. తొల‌గింపు

ABN, Publish Date - Feb 10 , 2026 | 07:45 PM

అల్లు అర్జున్‌ను క‌ల‌వాలంటే 42 ర‌కాల నిబంధ‌న‌లు ఉంటాయ‌ని ప్ర‌ముఖ బాలీవుడ్‌ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన కామెంట్లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

Allu Arjun

హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) తో యాడ్‌ షూట్‌ చేయాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయ‌ని వాటిన‌న్నింటిని అధిగ‌మిస్తేనే అర్జున్‌ను క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్‌ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన కామెంట్లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

‘సెలబ్రిటీలు ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. వారితో పనిచేసేటప్పుడు భిన్నమైన అనుభవాలు ఎదుర్కొన్నా. దక్షిణాది హీరోలకు టీమ్‌ చాలా పెద్దగా ఉంటుంది. అల్లు అర్జున్‌తో యాడ్‌కు పని చేసేటప్పుడు కూడా విచిత్రమైన అనుభవం ఎదురైంది. యాడ్‌ షూట్‌కు ఆయనను కలసినప్పుడు ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో ఓ 42 నిబంధనలు ఉంటాయి. వీటి అమలు విషయంలో ఆయన మేనేజర్లు చాలా కఠినంగా ఉంటారు. ‘హీరోకు కరచాలనం ఇవ్వకూడదు.

తగిన దూరం పాటించాలి. ఆయన కళ్లలోకి చూస్తూ మాట్లాడకూడదు.. సార్‌ అని గౌరవంగా సంబోధించాలి. అల్లు అర్జున్‌ సెట్‌లో ఉండగా ఫోన్‌ వాడకూడదు’ లాంటివి అందులో కొన్ని.. ఓ యాడ్‌ షూటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ వస్తుండగా సెట్‌లో ఎక్కడో చివర కూర్చుని నా ఫోన్‌ చూసుకుంటున్నా. అంతే ఆయన బాడీగార్డ్‌ ఒక్కసారిగా నా చేతిలోని ఫోన్‌ లాగేసుకుని ‘ఇక్కడ ఫోన్‌కు అనుమతి లేదు’ అని అన్నారు. కానీ నా పని అదేగా! బహుశా హీరో ప్రైవసీకి భంగం కలగకూడదని అలా కఠినంగా ఉండవచ్చు’ అని కావేరి బారువా పేర్కొన్నారు.

ఖండించిన పీఆర్‌ టీమ్‌

అయితే.. ఈ కావేరీ పాడ్ కాస్ట్‌పై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఆ పాడ్ కాస్ట్‌లో కావేరి చెప్పిందంతా అబ‌ద్ద‌మ‌ని, నిరాధార ఆరోప‌ణ‌లు అని అల్లు అర్జున్ ఆఫీస్ అధికారికంగా ఓ ప్రెస్‌ నోట్ సైతం విడుద‌ల చేసింది. అల్లు అర్జున్‌ ఎప్పుడూ హుందాగా, గౌరవప్రదంగా ఉంటారని తెలిపింది. కావేరీ చేసిన వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకుంటున్నామని ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

దీంతో ఈ న్యూస్ కాస్తా నెట్టింట తెగ వైర‌ల్ అయి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇదే అదనుగా అర్జున్ యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీటికి దీటుగా బ‌న్నీ ఫ్యాన్స్ సైతం సీన్‌లోకి వ‌చ్చి అల్లు అర్జున్ గ‌తంలో అభిమానులతో స‌ర‌దాగా క‌లిసిన, ఆప్యాయంగా మాట్లాడిన వీడియోల‌ను షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పాడ్ కాస్టర్ స్వీకృతి (sweekriti) త‌న ఇన్ స్టాలో పెట్టిన స్టేట‌స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 'పాడ్‌కాస్ట్‌లో కామెంట్స్ అనంత‌రం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ నుంచి వత్తిడి ఎక్కువైంద‌ని, బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని.. తన గెస్టు బారువాకు ప్ర‌మాదం ఉన్న దృష్ట్యా వీడియోను తొల‌గిస్తున్న‌ట్లు' పేర్కొంది.

Updated Date - Feb 11 , 2026 | 07:54 PM