సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Katta Srikara Prasad: కట్టా సుబ్బారావు తనయుడి హఠాన్మరణం

ABN, Publish Date - Jul 06 , 2026 | 11:41 AM

ప్రముఖ దర్శకుడు కట్టా సుబ్బారావు తనయుడు శ్రీకర ప్రసాద్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఎడిటర్ గా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన ఆర్.కె.పురంలో సినిమాను డైరెక్ట్ చేశారు.

Katta Srikara Prasad

తెలుగులో అగ్రకథానాయకులతో కుటుంబ కథాచిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు స్వర్గీయ కట్టా సుబ్బారావు తనయుడు, ఎడిటర్ శ్రీకర ప్రసాద్‌ (61) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తండ్రి బాటలో చిత్రసీమలోకి అడుగుపెట్టిన కట్టా శ్రీకర ప్రసాద్‌ ఎడిటర్ గా పలు చిత్రాలకు వర్క్ చేశారు. అలానే రెండేళ్ళ క్రితం వచ్చిన 'ఆర్.కె. పురంలో' అనే సినిమాకు దర్శకత్వం వహించారు.

ఆదివారం ఉదయం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కట్టా శ్రీకర ప్రసాద్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరంతా కాకినాడ నుండి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వీరంతా దుర్మరణం చెందారు.


ఫిల్మ్ ఎడిటర్‌గా, దర్శకుడిగా తన ప్రతిభతో తెలుగు సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన శ్రీకర్ ప్రసాద్ ఎంతో మంది సినీ ప్రముఖుల అభిమానాన్ని పొందారని,. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మిత్రులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అని తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు నివాళులు అర్పిస్తూ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ

ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్

ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’

Updated Date - Jul 06 , 2026 | 11:55 AM