ఆర్ఎక్స్ 100 హీరో గట్టి 'కమ్‌బ్యాక్'.. వర్కవుట్ అయ్యేనా
ABN, Publish Date - Sep 21 , 2026 | 06:49 PM
టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించి, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయ గుమ్మకొండ.
టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించి, వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తికేయ గుమ్మకొండ(Kartikeya Gummakonda). ఆర్‌ఎక్స్ 100 (RX 100) చిత్రంతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ గుర్తింపుతో పాటు భారీ క్రేజ్ లభించింది.ఆర్‌ఎక్స్ 100 తర్వాత కార్తికేయ వరుసగా కథానాయకుడిగా హిప్పి, గుణ 369, 90ML, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క, బెదురులంక 2012 వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. కేవలం హీరోగానే కాకుండా నాని నటించిన గ్యాంగ్ లీడర్, అలాగే తమిళంలో అజిత్ కుమార్ నటించిన వలిమై చిత్రాలలో పవర్‌ఫుల్ విలన్‌గా చేసి తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు.
గత రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న కార్తికేయ, ఇప్పుడు చాలా కాలం తర్వాత భారీ రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత కార్తికేయ తన 10వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాకు కమ్ బ్యాక్ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశాడు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. కార్తికేయ కేవలం కథానాయకుడిగానే కాకుండా మొదటిసారి దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయన సతిమణి లోహిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక విడుదలైన గ్లింప్స్ వీడియోలో కార్తికేయ బాక్సింగ్ రింగ్‌లో, పంచ్ బ్యాగ్‌తో ఎంతో ఇంటెన్స్‌గా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించాడు. మూడేళ్ల విరామం తర్వాత రింగ్‌లోకి దిగి కమ్‌బ్యాక్ ఇచ్చే ఒక బాక్సర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్యాప్ తర్వాత డబుల్ జోష్‌తో హీరోగా, డైరెక్టర్‌గా కార్తికేయ ఇస్తున్న ఈ కమ్ బ్యాక్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.