సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డోరతీ డైరెక్టర్ తో చిరు సినిమా..

ABN, Publish Date - Oct 07 , 2026 | 07:20 PM

ఇండస్ట్రీలో ఏదైనా హిట్ సినిమా వచ్చింది అంటే.. ఆ తరువాత ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని రూమర్స్ ఉన్నా.. మరికొన్ని వాస్తవాలు అని చెప్పొచ్చు.

Megastar

ఇండస్ట్రీలో ఏదైనా హిట్ సినిమా వచ్చింది అంటే.. ఆ తరువాత ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని రూమర్స్ ఉన్నా.. మరికొన్ని వాస్తవాలు అని చెప్పొచ్చు. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్‌కి సంబంధించిన వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'పేట', 'జిగర్తాండ', 'మహాన్‌' వంటి వినూత్నమైన మాస్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యినట్లు సమాచారం. ఈ మధ్యనే కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' సినిమాతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.


ఇక 'డోరతీ' సినిమా విజయం తరువాత కార్తీక్ సుబ్బరాజ్.. చిరు కోసం ఒక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్‌కి, ఆయన మాస్ మ్యానరిజమ్‌కి తగినట్లుగా కార్తీక్ సుబ్బరాజ్ ఒక పవర్‌ఫుల్ లైన్‌ను సిద్ధం చేసి, దాదాపు రెండున్నర గంటల పాటు వివరంగా కథను వినిపించినట్లు ఇండస్ట్రీ టాక్. మెగాస్టార్‌ను విభిన్నమైన క్యారెక్టరైజేషన్‌లో, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ టేకింగ్‌తో చూపించేలా ఈ కథను రూపుదిద్దినట్లు సమాచారం. కథనాన్ని విన్న చిరంజీవి పాజిటివ్‌గా స్పందించినప్పటికీ, ఇంకా అధికారికంగా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని, ప్రాజెక్ట్‌పై నిర్ణయం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందనే వార్త వైరల్‌గా మారింది. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కథలోని కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


ఒకవేళ ఈ కాంబినేషన్ ఓకే అయితే గనక, బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ మాస్ మేకింగ్, చిరంజీవి వింటేజ్ గ్రేస్ కలిస్తే టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కాంబోపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Oct 07 , 2026 | 07:20 PM