Ys Jagan: చెన్నైలో.. పెళ్లి వేడుక! జగన్‌తో.. విజయ్, సూర్య, కార్తీ, మోహన్ బాబు ముచ్చట
ABN, Publish Date - Feb 08 , 2026 | 06:40 PM
చెన్నైలో జరిగిన వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు ప్రముఖ సినీ తారలు హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సోదరుడు సునీల్ రెడ్డి (Y.S. Sunil Reddy) కుమారుడి వివాహ వేడుక ఆదివారం చెన్నై (Chennai) లీలా ప్యాలెస్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్ జగన్ ఫ్యామిలీతో సహా హజరయ్యారు. ఆయనతో పాటు తమిళ, తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు.
సినీ నటులు మంచు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ, తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీతో పాటు టీవీకే అధినేత విజయ్ (TVK Vijay), తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొని నూతన వధూవరులు సాహిల్, వేదికలకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వీరంతా వైఎస్ జగన్‌ను అప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించుకున్నారు. అంతేగాక వైఎస్ జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చొని ఉన్న వీడియో విజువల్స్, మోహన్ బాబు, సూర్య, కార్తిలతో మాట్లాడే వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.