సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రోహిత్ నారా ‘కపాలి’లో.. హన్సిక ఇంటెన్స్‌ ఫస్ట్ లుక్

ABN, Publish Date - Aug 10 , 2026 | 06:42 AM

రోహిత్ నారా హీరోగా తెరకెక్కుతున్న ‘కపాలి’ సినిమాలో హన్సిక మోత్వాని ఫస్ట్ లుక్ విడుదలైంది.

Kapaali

యంగ్ హీరో రోహిత్ నారా (Rohith Nara) కథానాయకుడిగా తెరకెక్కుతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కపాలి’ (Kapaali). విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కల్యాణ చక్రవర్తి మందినా, బాను కిరణ్ ప్రతాప నిర్మిస్తున్నారు. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రముఖ నటి హన్సిక మోత్వాని (Hansika Motwani) కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా హన్సిక పుట్టినరోజు సందర్భంగా ‘కపాలి’ చిత్రబృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హన్సిక లుక్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సైకలాజికల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హారర్ అంశాలతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు రామ్ గన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ నారా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హన్సికకు కీలకమైన పాత్ర దక్కినట్లు సమాచారం. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమెను చూపించిన విధానం సినిమాపై అంచనాలను పెంచుతోంది. త్వరలోనే ‘కపాలి’కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను చిత్రబృందం వెల్లడించనుంది.

Updated Date - Aug 10 , 2026 | 07:09 AM