సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kangana Vs, Taapsee: బీ గ్రేడ్ సినిమా ప్రమోషన్ కోసం.. నా పేరు వాడుతోంది

ABN, Publish Date - Aug 24 , 2026 | 08:52 AM

కంగనా రనౌత్, తాప్సీ మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది.

Kangana Ranaut, Taapsee

కంగనా రనౌత్ (Kangana Ranaut), తాప్సీ (Taapsee Pannu) మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. తను నటించిన ‘గాంధారి’ (Gandhari) సినిమా ప్రమోషన్స్‌లో నటి తాప్సీ కంగనాతో ఉన్న విబేధాల గురించి మాట్లాడారు. ‘వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ నేను కంగనాను వ్యక్తిగతంగా కలవలేదు. ఆమెపై నా అభిప్రాయం అనేది నా పెంపకం, మాట్లాడే తీరు, నా ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుంది. ఆమె విధానం ఎవరు ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకోవడానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై కంగనా సోషల్‌మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ‘ఓ చౌకబారు కాపీ (‘సస్తీ కాపీ) తన ‘బీ గ్రేడ్‌’ సినిమా ప్రమోషన్స్‌ కోసం బయటకు వచ్చింది. ఎప్పటిలాగే మీడియా హెడ్‌లైన్స్‌లో ఉండడానికి నా పేరు వాడుకుంటోంది. మా తల్లిదండ్రుల్లా వారి పేరెంట్స్‌ ఒక నిజమైన బిడ్డకు ఎందుకు జన్మనివ్వలేకపోయారో వారిని అడగాలనుంది. ఇలాంటి చౌకబారు కాపీని కన్నందుకు వారిని చూస్తే జాలేస్తోంది’ అని విమర్శించారు.

కాగా, 2019లో కంగనా నటించిన ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ సినిమా సమయంలో ఆమె సోదరి రంగోలి తాప్సీని ఉద్దేశించి మొదటిసారి చౌకబారు కాపీ అని సంభోధించారు. ఆ తర్వాత నెపోటిజం చర్చల సమయంలో కంగనా తాప్సీ, స్వర భాస్కర్‌లను ‘బీ గ్రేడ్‌’ నటీమణులుగా పేర్కొనడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తాప్పీ నటించిన గాంధారి సెప్టెంబరు 3వ తేదీన నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది.

Updated Date - Aug 24 , 2026 | 09:24 AM