సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఉదార‌త చాటుకున్న.. ‘కాంచన’ నటుడు! గబ్బర్ సింగ్ రమేష్‌కి శ్రీమన్ సాయం

ABN, Publish Date - Sep 30 , 2026 | 12:17 PM

అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘గబ్బర్ సింగ్’ రమేశ్‌కు నటుడు శ్రీమాన్ ఆర్థిక సాయం చేసినట్లు గ్యాంగ్ సభ్యులు తెలిపారు.

Ramesh, Sriman

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్ (Gabbar Singh Ramesh). ఈ మూవీలో అంత్యాక్షరి గ్యాంగ్ సభ్యుడిగా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

అయితే, ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చాలా రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోంది. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, మెరుగైన వైద్యం కారణంగా ఆయన త్వరగా కోలుకుంటున్నారు.

తాజాగా, రమేశ్‌కు 'కాంచన' ఫేమ్ నటుడు శ్రీమాన్ (Sriman) రూ. 25 వేల ఆర్థిక సాయం చేసినట్లు 'గబ్బర్ సింగ్' గ్యాంగ్ తెలిపింది. 'జనవరి 12న విడుదల' చిత్రంలో శ్రీమాన్‌తో కలిసి రమేశ్ నటించారని, ఆ తర్వాతే ఈ అనారోగ్య ఘటన జరిగిందని వారు చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమాన్ వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించారు. శ్రీమాన్ నటన ఎంతో బాగుంటుందని కొనియాడిన గ్యాంగ్ సభ్యులు, ఆపదలో ఉన్న సమయంలో సాయం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - Sep 30 , 2026 | 12:18 PM