సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kamal Haasan: కమల్‌హాసన్‌ నిర్ణయం అద్భుతం..

ABN, Publish Date - May 18 , 2026 | 09:35 PM

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ తీసుకున్న ఓ నిర్ణయంతో ఆయన గొప్ప నటుడో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెబుతూ వైజయంతీ మూవీస్‌ సంస్థ ఓ ట్వీట్‌ చేసింది.

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) తీసుకున్న ఓ నిర్ణయంతో ఆయన గొప్ప నటుడో, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో చెబుతూ వైజయంతీ మూవీస్‌ సంస్థ ఓ ట్వీట్‌ చేసింది. ఇటీవల కాలంలో సినిమా షూటింగ్‌ బడ్జెట్‌ కన్నా నటీనటులకు కల్పించే సౌకర్యాలు ఖర్చే ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎకానమీ ఫ్లైట్‌లో ఆయన షూటింగ్‌కు హాజరవడాన్ని అభినందించింది.

‘ప్రస్తుతం సినిమా పరిశ్రమ నిర్మాణపరంగా ఎంతో కష్టాలను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కమల్‌హాసన్‌దీతిజిజి ప్రైవేట్‌ చార్టర్‌ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను పక్కనపెట్టి, ఎకానమీ ఫ్లైట్‌లో నేరుగా షూటింగ్‌ సెట్‌కు వస్తున్నారు. ఆ నిర్ణయం ఆయన ఎంతటి దిగ్గజమో తెలియజేస్తోంది. చిత్ర పరిశ్రమలో అద్భుతాలె జరగడానికి ఇది మొదటి అడుగు అనుకోవచ్చు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. సినీ ఇండస్ర్టీలో అద్బు?తా?ని జరగడానికి మొదటి అడుగు ఇది’ అని పేర్కొంది.

ప్రభాస్‌ హీరోగా నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి కొనసాగింపుగా పార్ట్‌ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే! ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో కమల్‌ సుప్రీం యాస్కిన్‌గా విలన్‌గా నటిస్తున్నారు. ఈ మధ్యన కమల్‌, అమితాబ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. తాజా షెడ్యూల్‌ కోసం కమల్‌ హైదరాబాద్‌ వచ్చారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను వైజయంతీ సంస్థ ట్వీట్‌ చేసింది.

Updated Date - May 18 , 2026 | 09:37 PM