Kamal Haasan: నాకు 50 ఏళ్ల క్రితమే ‘సింగ్ గీతం’ కథ తెలుసు!

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:58 PM

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు కమల్ హాసన్ హాజరై, ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Kamal Haasan at Sing Geetham Pre Release Event

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చెన్నై‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సల్ స్టార్ కమల్ హసన్ (Kamal Haasan) ముఖ్య అతిథిగా హాజరై, సింగీతంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘మాయాబజార్’ చిత్రం నుంచి ఇప్పటి ‘సింగ్ గీతం’ వరకు సింగీతం శ్రీనివాసరావులో ఎలాంటి మార్పు లేదు. సినిమా ఎప్పుడూ ఆయనతో పాటే ఉంది. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఏంటంటే.. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఆయన సినిమాకి నిర్మాతగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. నా ఉద్దేశం ఆయనతో కలిసి పని చేయడమే. చాలా ఏళ్ల క్రితం ఆయన నాకు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి ‘పుష్పక విమానం’. రెండోది ఈ ‘సింగ్ గీతం’. ఇందులో ‘పుష్పక విమానం’ సినిమాగా వచ్చేసింది. ఇప్పుడు రెండో కథ ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఈ ‘సింగ్ గీతం’ కథ విన్నాను. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆ సినిమాను చూడబోతున్నాను.


కొన్ని ఆలోచనలు, కథలు టైమ్‌లెస్‌గా ఉంటాయనే దానికి సింగీతం కథలే ఉదాహరణ. అవి ఏజ్‌లెస్‌గా ఉంటాయని ‘సింగ్ గీతం’ నిరూపించింది. సింగీతం పేరును చాలామంది ‘సంగీతం’ అని పలుకుతుంటారు. కానీ ఈ సినిమా టైటిల్‌తో ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. ఇకపై అందరూ ‘సింగీతం’ అనే పిలుస్తారు. ఆయన పేరులోనే సంగీతం ఉంది. ఆయన ఇప్పుడు కూడా జెన్ జీ కంటే ముందే ఉన్నాను. ఆయనను ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఆయనకు సహాయ దర్శకుడిగా పని చేయడానికి నేను ఇష్టపడతాను. స్వప్నకు, వైజయంతి మూవీస్‌కు థ్యాంక్స్. సినిమా అనేది ప్యాషన్‌తో చేయాల్సిన వర్క్. అలాంటి ప్యాషన్‌తో సినిమా తీస్తే ఊహించని విజయాన్ని అందిస్తుంది. ‘పుష్పక విమానం’ సినిమానే అందుకు మంచి ఉదాహరణ. సింగీతం నుంచి మనం ఆ ప్యాషన్‌నే నేర్చుకోవాలి.


ఏ సినిమా విజయం సాధిస్తుందో, ఏ సినిమా సాధించదో ఎవరూ ముందుగా చెప్పలేరు. కానీ సినిమా పూర్తయ్యే సరికి.. అందులో భాగమైన వారంతా సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది మాత్రం తెలుస్తుంది. ‘పుష్పక విమానం, ముంబై ఎక్స్‌ప్రెస్, అపూర్వ సోదరులు’ వంటి చిత్రాలు మంచి స్పిరిట్‌తో తెరకెక్కాయి. అలాంటి స్పిరిట్‌తోనే వస్తున్న సినిమా ‘సింగ్ గీతం’. ఈ సినిమాను నేనే నిర్మించినట్లుగా భావిస్తున్నాను. నేను సహ నిర్మాతగా ఉన్నాననే భావన వస్తోంది. అది నాగీకి కూడా తెలుసు. సింగీతం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించే చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ వేడుకకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు మూడు నెలల క్రితమే చెప్పి ఉంటే.. నేను కూడా యూనిట్‌లో భాగమయ్యేవాడిని. ఆ అవకాశాన్ని కోల్పోయాను. కానీ సింగీతంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనతో కలిసి పనిచేసే మరో అవకాశం వస్తుందని నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

Updated Date - Jun 07 , 2026 | 05:58 PM