Kalyan Ram: ఈసారి సంక్రాంతి బ్లాస్ మామూలుగా ఉండదు..
ABN, Publish Date - Jul 05 , 2026 | 10:51 AM
Kalyan Ram’s Stylish New Look from Anil Ravipudi’s
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకులుగా హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ సహనిర్మాణంలో.. షైన్ స్ర్కీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి టార్గెట్‌గా రానున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఆయన ప్రమోషన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలిసిందే! సినిమా ప్రారంభానికి ముందే జీవీ ప్రకాశ్‌ను ఇసుకలో పూడ్చి ప్రమోషన్ మొదలుపెట్టారు. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. కల్యాణ్‌రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మేకర్స్ కొత్త లుక్‌ను విడుదల చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్టెప్పులు వేస్తున్న పోస్టర్‌లో కల్యాణ్‌రామ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘అనిల్ రావిపూడి జోన్‌లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేకమైన ఆనందమే. 2027 సంక్రాంతికి బ్లాస్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అని కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు.
అనిల్ రావిపూడి కూడా కల్యాణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘నా తొలి హీరో, అత్యంత సన్నిహితమైన మిత్రుల్లో ఒకరైన నందమూరి కళ్యాణ్‌రామ్‌గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఓ కొత్త దర్శకుడిగా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు రాబోతున్న చిత్రంలో కొత్త అవతార్‌లో చూపించడానికి ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. రాబోయే సంక్రాంతిని గొప్పగా సెలబ్రేట్ చేద్దాం’ అని రాసుకొచ్చారు.