సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పొట్టి పిల్ల.. పొట్టి పిల్ల..  నా గుండెకు నువ్వే బొట్టు బిళ్ళ..

ABN, Publish Date - Mar 24 , 2026 | 03:46 PM

కీరవాణి తనయుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ (Kala Bhairava) ప్రేమలో పడ్డారని కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Kavya-Kalyanram.jpg


కీరవాణి తనయుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ (Kala Bhairava) ప్రేమలో పడ్డారని కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కథానాయిక కావ్యా కల్యాణ్‌రామ్‌తో (Kavya kalyanram) ఆయన ప్రేమలో ఉన్నారని టాక్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఎక్కడా స్పందించలేదు. కానీ.. వీరిద్దరూ ఇటీవల ఓ ఫంక్షన్‌కు కలిసి వెళ్లారు. దాంతో రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన వీడియో మంగళవారం ఉదయం నుంచి నెట్టింట వైరల్‌ అవతుతోంది. దాంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.

భైరవ తమ్ముడు శ్రీసింహ హీరోగా నటించిన ‘ఉస్తాద్‌’ సినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్‌ కథానాయిక. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. అక్కడ మొదలైన పరిచయం ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా వైరల్‌ అవుతోన్న రెస్టారెంట్‌ వీడియోతో ఇద్దరి మధ్య బంధానికి హింట్‌ ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇందులో నిజం ఉందనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే!

గంగోత్రి సినిమాతో ఛైల్డ్‌ ఆర్టిస్‌గా కెరీర్‌ ప్రారంభించిన కావ్య 2022లో వచ్చిన మసూదతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ‘బలగం’తో మంచి హిట్‌ అందుకున్నారు. గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భైరవ ‘మత్తు వదలరా’ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారారు. అటు సింగర్‌గానూ, సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నారు. 

Updated Date - Mar 24 , 2026 | 04:39 PM