Kajal Aggarwal: నల్ల కలువలా విరిసిన చందమామ..
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:45 PM
ఇండస్ట్రీలో పెళ్లి తరువాత హీరోయిన్లు తమ అందాన్ని కోల్పోతారు. ఇక తల్లి అయ్యాక అయితే అస్సలు గుర్తుపట్టలేనివిధంగా మారిపోతారు.
Kajal Aggarwal: ఇండస్ట్రీలో పెళ్లి తరువాత హీరోయిన్లు తమ అందాన్ని కోల్పోతారు. ఇక తల్లి అయ్యాక అయితే అస్సలు గుర్తుపట్టలేనివిధంగా మారిపోతారు. సీనియర్ హీరోయిన్లను ఇలా చాలామందిని చూసాం. కానీ ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ మాత్రం తల్లి అయినా కూడా అందం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ని మొత్తం ఏలిన మహారాణీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). సీనియర్ హీరో.. కుర్ర హీరో అనే తేడా లేకుండా అందరితో నటించి మెప్పించిన హీరోయిన్ గా కాజల్ కి ఒక రేర్ రికార్డ్ ఉంది.
ఇక పెళ్లి తరువాత కాజల్ జోరు తగ్గింది. కానీ, అమ్మడి అందంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ కొద్దిగా ఒళ్లు చేసిన మాట వాస్తవమే కానీ, ఉన్నా కొద్దీ కాజల్ తన ఫిట్ నెస్ మీద బాగా ఫోకస్ చేసి యధా రూపానికి చేరుకుంది. గత కొన్ని నెలలుగా కాజల్ ఎక్కువగా కుటుంబంతో సమయాన్ని గడుపుతుంది. భర్త గౌతమ్.. కొడుకు నీల్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది.
అంతకు ముందు కొద్దిగా బొద్దుగా కనిపించిన కాజల్.. తాజాగా పర్ఫెక్ట్ లుక్ తో కనిపించి షాక్ ఇచ్చింది. బ్లాక్ కలర్ డిజైనర్ ఫ్రాక్ లో నల్ల కలువలా విరబూసింది. పర్ఫెక్ట్ జా లైన్ తో మునుపటి కాజల్ ని అభిమానులకు పరిచయం చేసింది. కాజల్ ని ఇలా చూసినవారెవ్వరూ కూడా ఒక బిడ్డకు తల్లి అంటే నమ్మరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందమే అతివగా మారితే నువ్వే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం కుటుంబంతో వెకేషన్ అయ్యిపోవడంతో ఇక ఛాన్స్ ల కోసం ముద్దుగుమ్మ వేట మొదలుపెడుతుందేమో చూడాలి.