సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: తమన్‌.. ‘కాకా’ పబ్లిసిటీ తగ్గించు.. లేదంటే వాళ్లు బాధపడతారు!

ABN, Publish Date - Nov 19 , 2026 | 08:34 AM

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్‌ పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నందమూరి బాలకృష్ణ (Balakrishna) మధ్య బాక్సాఫీస్‌ పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనప్పుడల్లా అభిమానుల్లో క్రేజ్‌ మామూలుగా ఉండదు. తాజాగా చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు తమన్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ బాలయ్యకు కౌంటర్‌ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఇటీవల ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్‌ మీట్‌లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమన్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘తమన్‌ ఈ మధ్య ఏ వేదికపై చూసినా ‘కాకా’ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మిగతావాళ్లు మా సినిమా గురించి మాట్లాడటం లేదు.. ‘కాకా’నే అంత బాగుందా? ‘కాకా’నే కేక అంటున్నారు. దీని వల్ల తమన్‌కు చిన్న ప్రమాదం ఉంది. తమన్‌.. నువ్వు అన్ని సినిమాల గురించి మాట్లాడితే మాట్లాడు.. లేదంటే మాట్లాడటం మానేయ్‌. కొంచెం పబ్లిసిటీ తగ్గించాలి తమన్‌’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అలా అంటూనే తమన్‌ చెప్పింది అంతా నిజమేనని, డెఫినెట్‌గా కొడతామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

వేదికపై చిరంజీవి సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు ఇతర చిత్రాలకు ఆపాదిస్తున్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల్లోని ‘మిగతావాళ్లు’ ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. ప్రస్తుతం తమన్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సినిమాల్లో ‘కాకా’, బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ‘దాదా’ కూడా ఉన్నాయి. ‘కాకా’ కంటే ముందే డిసెంబర్‌ 24న ‘దాదా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తమన్‌ ‘కాకా’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడని, ‘దాదా’ గురించి ప్రస్తావించడం లేదనే ఉద్దేశంతోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారా? అంటూ కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తమన్‌ చేతిలో ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులే ఉండటంతో చిరంజీవి మాటలకు రకరకాల అర్థాలు తీస్తున్నారు. బాలకృష్ణను ఉద్దేశించే మెగాస్టార్‌ ఈ వ్యాఖ్యలు చేశారా? లేక తమన్‌ ప్రచార శైలిపై సరదాగా స్పందించారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చిరంజీవి తన వ్యాఖ్యల్లో బాలకృష్ణ పేరు గానీ, ఆయన నటిస్తున్న సినిమా పేరు గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ మెగాస్టార్‌ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొత్త చర్చకు తెరలేపాయి.

Updated Date - Nov 19 , 2026 | 08:46 AM