సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr Ntr: చరణ్ సినిమా విడుదల.. తారక్ ఏం చేశాడంటే

ABN, Publish Date - Jun 05 , 2026 | 07:09 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో అరుదుగా పోస్ట్‌లు పెడుతుంటారు. తన చిత్రాలకు సంబంధించిన విశేషాలు, కుటుంబంతో టూర్‌కి వెళ్లిన ఫొటోలను మాత్రమే షేర్‌ చేస్తుంటారు.

Jr Ntr


జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr ntr) సోషల్‌ మీడియాలో అరుదుగా పోస్ట్‌లు పెడుతుంటారు. తన చిత్రాలకు సంబంధించిన విశేషాలు, కుటుంబంతో టూర్‌కి వెళ్లిన ఫొటోలను మాత్రమే షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.



తారక్‌తో మంచి నటుడే కాదు.. మంచి కుక్‌ కూడా. కుదిరిన ప్రతిసారీ వంటింట్లో గరిట తిప్పుతుంటారు. తాజాగా వంటింట్లో ఆయన సందడి చేశారు. రుచికరమైన బిస్కెట్లు తయారు చేశారు. ‘కొన్నవి కాదు నేనే  తయారు చేశా ఇదే మొదటి ప్రయత్నం’ అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. దీనికి నెటిజన్లు, అభిమానులు 'మాకు కూడా రుచి చూపించు అన్నా' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు అయితే ‘రామ్‌చరణ్‌ సినిమా రిలీజ్‌ సందర్భంగా భీమ్‌ బేకింగ్‌ బిస్కెట్స్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు.



ప్రస్తుతం తారక్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ సినిమాలో నటిస్తున్నారు. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. వచ్చే ఏడాది జూన్‌ 11న సినిమా విడుదల కానుంది.


Updated Date - Jun 05 , 2026 | 07:20 PM