రికార్డులు బద్దలే.. 4 నిమిషాల 35 సెకన్ల 'డ్రాగన్' గ్లింప్స్..!
ABN, Publish Date - May 17 , 2026 | 09:44 AM
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక నయా ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే కేవలం ఒక టీజర్.. లేదా ఒక ట్రైలర్‌తో ముగిసిపోయేవి. అది కూడా మహా అయితే ఒక నిమిషంలోపే ఉండేది. కానీ రోజులు మారాయి..
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక నయా ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే కేవలం ఒక టీజర్.. లేదా ఒక ట్రైలర్‌తో ముగిసిపోయేవి. అది కూడా మహా అయితే ఒక నిమిషంలోపే ఉండేది. కానీ రోజులు మారాయి.. ట్రెండ్ మారింది! ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయడానికి మన దర్శక నిర్మాతలు సరికొత్త పద్ధతులను స్క్రీన్‌పైకి తెచ్చారు. ప్రీ-గ్లింప్స్ అన్నారు.. గ్లింప్స్ అన్నారు.. ఆపై టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ అంటూ రకరకాల కంటెంట్‌తో థియేటర్లకు జనాన్ని లాగే ప్లాన్స్ వేస్తున్నారు.
ఇవన్నీ కూడా గరిష్టంగా రెండు నుంచి మూడు నిమిషాల లోపే ఉండేలా చూసుకునేవారు. కానీ, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మేకర్స్ ఈ ట్రైలర్ల అర్థాన్నే మార్చేశారు. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో ట్రైలర్లను వదులుతూ కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి రెడీ అయిపోయారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR).. అలాగే కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel).
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ (Dragon). ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జనరల్‌గా టీజర్ అంటే ఒక నిమిషం.. గ్లింప్స్ అంటే ముప్పై సెకన్లు ఉంటుంది. కానీ 'డ్రాగన్' గ్లింప్స్ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్లు ఉండబోతోందట! దీనికి సంబంధించిన ఒక ఎడిటింగ్ రూమ్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడంతో ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
ఒక గ్లింప్స్ కోసం ఇంత నిడివి కేటాయించడం అంటే.. ప్రశాంత్ నీల్ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం సృష్టించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమాలు వచ్చినా.. ఈ చిత్రానికి వస్తున్న హైప్ మాత్రం టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే, ఇటు నటనలో విశ్వరూపం చూపించగల నటుడు.. అటు మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు ఒకే ఫ్రేమ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి.
ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ఈ భారీ గ్లింప్స్‌ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ఉదయాన్నే ఎన్టీఆర్ అభిమానులు ఈ మోస్టర్ అప్‌డేట్‌తో నిద్ర లేవడం ఖాయం. అయితే, అసలు ఈ 4 నిమిషాల పైగా ఉండే టీజర్‌లో ఏం చూపించబోతున్నారు? ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది? అనే క్యూరియాసిటీ అందరిలోనూ పీక్స్‌కు చేరింది. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ఈ గ్లింప్స్‌లో ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ డార్క్ థీమ్‌తో పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను భారీగా ప్లాన్ చేశారట. ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో చూపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షనే కాకుండా.. సినిమా కథా నేపథ్యం ఏంటి అనే హింట్‌ను కూడా ఈ గ్లింప్స్ ద్వారా ఇవ్వబోతున్నారట. అందుకే దీని రన్ టైమ్ ఇంత లెంగ్తీగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రైలర్ల రన్ టైమ్ విషయంలో బాలీవుడ్ క్రియేట్ చేసిన రికార్డులను.. ఈ టాలీవుడ్ డ్రాగన్ క్లీన్ స్వీప్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్.. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మే 20న రాబోతున్న ఈ డ్రాగన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.