సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr Ntr: 'దండోరా’ చిత్ర బృందానికి  ఎన్టీఆర్ ప్రశంసలు.. 

ABN, Publish Date - Jan 20 , 2026 | 09:09 AM

మంచి సినిమాల‌కు ఎప్పుడూ మ‌ద్ధ‌తుగా నిలుస్తారు  స్టార్ హీరో ఎన్టీఆర్(Ntr). తాజాగా అయన ‘దండోరా’ (Dhandora)సినిమాను వీక్షించారు.

మంచి సినిమాల‌కు ఎప్పుడూ మ‌ద్ధ‌తుగా నిలుస్తారు  స్టార్ హీరో ఎన్టీఆర్(Ntr). తాజాగా అయన ‘దండోరా’ (Dhandora)సినిమాను వీక్షించారు. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.  క‌థ‌, క‌థ‌నం, పాత్ర‌ల తీరు తెన్నులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరు బాగా నచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ పెట్టారు. ‘నేను ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. చాలా లోతుగా, బ‌లమైన‌ ఆలోచనల‌కు దారి తీసేలా రూపొందించిన సినిమా ఇది. శివాజీ గారు, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి.... ఇలా అందరూ అద్భుతంగా నటించారు. దీన్నొక రూటెడ్ క‌థ‌గా, అద్భుతంగా రాసి తెరకెక్కించిన దర్శకుడు  మురళీ కాంత్ కి  నా అభినందనలు. అలాగే ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి గొప్ప సినిమాలో భాగమైన నటీనటులు, సాంకేతిక బృందానికి హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. 


సంయుక్త ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ నేప‌థ్యంతో రూటెడ్ క‌థాంశంతో ఈ ’ సినిమా రూపొందింది. కలర్ ఫొటో, ‘బెదురులంక 2012’ వంటి డిఫరెంట్ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మించారు. డిసెంబ‌ర్ 25న రిలీజైంది. ఇప్పుడు  అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - Jan 20 , 2026 | 09:22 AM