సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. అప్పుడే రివ్యూలు ఇచ్చేసిన మహేష్ బాబు, ఎన్టీఆర్

ABN, Publish Date - Oct 01 , 2026 | 01:44 PM

ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతుండగా భారీ బజ్ నెలకొంది.

maheshbabu jr ntr

ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don't Trouble The Trouble) సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతుండగా, రాజమౌళి సమర్పణ, ఎన్టీఆర్ ఈవెంట్‌కు రాకతో ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. శశాంక్ ఏలేటి (Shashank Yeleti) దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బలమైన ఎమోషన్ ఉన్న ఈ మూవీ అందరి మనసులను హత్తుకుంటుందని, ఫహద్ (Fahadh Faasil) నటన, చిన్నారి సారా (Sara Palekar) పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్తికేయ (S. S. Karthikeya) పడిన కష్టం స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోందని, ఆయనకు ఇది అదిరిపోయే స్టార్ట్ అంటూ మహేష్ తన రివ్యూ ఇచ్చారు.

మ‌రోవైపు.. ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( Jr ntr ) సైతం ప్రశంసలు కురిపించారు. 'సూరి' పాత్రలో ఫహాద్ నటన అద్భుతమని, చిన్నారి సారా పెర్ఫార్మెన్స్ మనసు దోచుకుందని ఎన్టీఆర్‌ ప్రశంసించారు. తొలి చిత్రంతోనే ప్యూర్ ఎమోషన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు శశాంక్‌తో పాటు, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన కాల భైరవను తారక్ ప్రత్యేకంగా అభినందించారు. కార్తికేయ నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ రోలర్‌కోస్టర్‌ను అక్టోబర్ 2న థియేటర్లలో తప్పక చూడాలని పిలుపునిచ్చారు.

Updated Date - Oct 01 , 2026 | 02:05 PM