సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jr Ntr: తారక్ కొత్త సినిమా.. వీడియోతో అధికారిక ప్రకటన 

ABN, Publish Date - May 09 , 2026 | 11:39 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr Ntr), త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ ఎనిమిదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే!

జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr Ntr), త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ ఎనిమిదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబో కుదిరింది. ఇప్పటికే దీనికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కుమారస్వామి స్ఫూర్తితో సాగే కథ అని నిర్మాణ సంస్థ తరఫున నాగవంశీ ఓ సందర్భంలో తెలిపారు. అయితే అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్త వైరల్‌ అవుతోంది. కొత్త అప్‌డేట్‌తో అభిమానులను ఖుషీ చేయనున్నారు మేకర్స్‌. ఈ నెల 20 తారక్‌ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది. దీని కోసం చిత్ర బృందం ప్రత్యేక వీడియో రెడీ చేస్తుందట.

కుమారస్వామి ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెడతారని, రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రథమార్థంలో మొదలయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం తారక్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు తారక్‌.

Updated Date - May 09 , 2026 | 11:39 AM