Joker: అతనొక సైంటిస్ట్.. కానీ సైన్స్‌లో ఫెయిలయ్యాడు..
ABN, Publish Date - May 07 , 2026 | 10:45 AM
మెన్ టూ,రణరంగం, కిరాక్ పార్టీ , తెల్లవారితే గురువారం వంటి సినిమాల్లో నటించిన మౌర్య సిద్దవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జోకర్’.
మెన్ టూ,రణరంగం, కిరాక్ పార్టీ , తెల్లవారితే గురువారం వంటి సినిమాల్లో నటించిన మౌర్య సిద్దవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జోకర్’(Joker). గీత సి శేఖర్ (geetha C sekhar) దర్శకత్వం వహిస్తున్నారు. మీరా ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సందీప్ రామినేని నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
దీని కోసం టాప్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ పని చేయబోతున్నారు. షూటింగ్ మొత్తం తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరగనుంది. త్వరలో ఇతర వివరాలు ప్రకటించబోతున్నారు. ఫస్ట్ లుక్ కు చక్కని ప్రశంసలు దక్కాయి. జోకర్ రోల్ కు మౌర్య సిద్దవరం పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉన్నారని మేకర్స్ చెబుతున్నారు.