Lenin: జయ మంగళం.. నిత్య శుభమంగళం.. అదిరిపోయింది సాంగ్
ABN, Publish Date - Jul 05 , 2026 | 03:43 PM
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించాడు.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మించాడు. ఇప్పటికే ఎన్నో వాయిదాల తరువాత జులై 10 న ప్రేక్షకుల ముందకు వస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం లెనిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో ఎంతోమందిని ఆకట్టుకున్న జయ మంగళం సాంగ్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లో వచ్చిన రెండు లైన్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక ఇప్పుడు పూర్తి లిరికల్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చాడు. ముఖ్యంగా జయ మంగళం పాటలో సాంప్రదాయ వివాహ వేడుకల వైభవాన్ని, పల్లెటూరి పెళ్లిళ్ల అందాన్ని తన సంగీతంతో వినిపించాడు. ఆకట్టుకునే బాణీలు, గ్రామీణ నేపథ్యానికి తగ్గట్టుగా సాగిన ఈ పాట పెళ్లిళ్ల సీజన్‌లో మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కి ఎస్పీ చరణ్, కుమర వాగ్దేవి, విజయలక్ష్మీ తమ గానంతో ప్రాణం పోశారు. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఈ లిరికల్ వీడియోకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఈ లిరికల్ సాంగ్‌లో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సేల స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీ హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సాంగ్ కావడంతో వీడియోని చూపించలేదని తెలుస్తోంది. ఇక థియేటర్ లో ఈ సాంగ్ మోత మోగడం ఖాయమనిపిస్తోంది. పల్లెటూరి వాతావరణం, పెళ్లి హడావిడి ప్రతిబింబించేలా ఉన్న ఈ లిరికల్ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవచ్చని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అఖిల ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.