‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ నెలలోనే!
ABN, Publish Date - Jul 03 , 2026 | 05:02 PM
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి విభిన్న చిత్రాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతోన్న జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni).. ఇప్పటికే తన స్టన్నింగ్ లుక్స్, ఆకట్టుకునే బేస్ వాయిస్‌తో మంచి ఇంప్రెషన్‌ని క్రియేట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జయకృష్ణ ఘట్టమనేని.. ఆ వారసత్వాన్ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళతాడనే నమ్మకాన్ని ఘట్టమనేని అభిమానులకు ఇప్పటికే కల్పించాడు. ప్రేక్షకులలో కూడా ఆ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు.
ఈ జూలైలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో హీరో జయకృష్ణ, హీరోయిన్ రాషా తడాని కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇందులో గొప్ప లవ్ స్టోరీని దర్శకుడు చూపించబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ ఇప్పటికే వచ్చిన టీజర్‌లో మెప్పించడంతో.. కచ్చితంగా ఈ జంట సక్సెస్ కొడతారనేలా అప్పుడే టాక్ మొదలైంది.
లెజెండరీ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఇందులో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇక విడుదల తేదీ ఫిక్స్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్‌పై మరింతగా దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!
72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?
National Award: మళ్లీ అల్లు అర్జున్‌కేనా? అదే జరిగితే చరిత్రే!