Srinivasa Mangapuram: కృష్ణ మనుమడు.. రంగంలోకి దిగాడు! తొలి వారసుడి.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
ABN, Publish Date - Jan 10 , 2026 | 01:28 PM
సూర్‌స్టార్ కృష్ణ మనుమడు, రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురం.
సూర్‌స్టార్ కృష్ణ మనుమడు, రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni ) హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ఆరెక్స్ 100, మంగళవారం చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ తనయ నేటి ఇండియన్ యూత్ హార్ట్ త్రోబ్ రషా తదాని (Rasha Thadani) హీరోయిన్‌గా టాలీవుడ్‌లకి ఎంట్రీ ఇస్తోంది. చందమామ కథలు (Chandamama Kathalu Pictures) బ్యానర్‌పై వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) అశ్వీనిదత్ (Aswini Dutt), ఆనంది ఆర్ట్స్ ( Anandi Art Creations) జెమినీ కిరణ్ (Gemini Kiran) సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ఎదుటకు రానుంది. అయితే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మూవీ మేకర్స్ ముందుగానే డిబెడెంట్ ఆఫ్ ది ఇయర్ అంటూ రెండు రోజుల ముందుగానే ఈ సినిమా నుంచి హీరో జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) స్వయంగా సోషల్ మీడియా ద్వారా పోస్టర్ రిలీజ్ చేసి తనయుడికి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ పోస్టర్‌లో బైక్‌పై వెళుతూ పత్యర్థిని షూట్ చేసే లుక్‌లో జయకృష్ణ సీరియస్, ఇంటెన్స్ లుక్‌లో అదిరిపోయాడు. కొన్ని యాంగిల్స్ లో మహేశ్ బాబును మరి కొన్ని యాంగిల్స్ తండ్రి రమేశ్ బాబును గుర్తు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్ వేయండి.