సంపత్ నంది వదిలిన 'జయహో జనార్ధన' ఫస్ట్ లుక్
ABN, Publish Date - Apr 10 , 2026 | 05:19 PM
నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'జయహో జనార్ధన'.
నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'జయహో జనార్ధన'. పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను దర్శకుడు సంపత్ నంది ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పరు. సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
'లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు చెప్పారు. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా, 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు, BVM శివశంకర్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : విజయ్ టాగూర్, ఆర్ట్ : భూపతి యాదగిరి, ఎడిటర్ : నందమూరి హరి, ఎన్టీఆర్, మ్యూజిక్ : చరణ్ అర్జున్