జయ జానకి నాయక రేర్ రికార్డ్.. బోయపాటి సినిమానా మజాకానా
ABN , Publish Date - Jun 29 , 2026 | 03:06 PM
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) నార్త్ ఇండియాలో తనకున్న ఊహించని క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) నార్త్ ఇండియాలో తనకున్న ఊహించని క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఆయన నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జయ జానకి నాయక (Jaya Janaki Nayaka) హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. హిందీలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ మైలురాయిని అధిగమించి, భారత సినీ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన సినిమాగా అరుదైన రికార్డు సాధించింది. 2017 లో రిలీజ్ అయిన జయ జానకి నాయక అప్పట్లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మాస్ యాక్షన్ చిత్రాలకు హిందీ బెల్ట్‌లో ఎప్పుడూ భారీ ఆదరణ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో, కేవలం యూట్యూబ్ వ్యూస్‌తోనే 100 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ సత్తాను చాటాడు బెల్లంకొండ శ్రీనివాస్. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాయి శ్రీనివాస్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ నార్త్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా లాంగ్ రన్‌లో ఈ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి రేర్ రికార్డ్ ను అందుకున్న సినిమా తెలుగు సినిమా కావడం ఇండస్ట్రీకే గర్వకారణం అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.ఆ సినిమా హిట్ కాకపోయినా.. అందులోని సీన్స్, ఎమోషన్స్ ప్రేక్షకులను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ, నీ కూతురు నిప్పురా అంటూ మీమ్స్ తెగ హల్చల్ చేశాయి. ఆ డైలాగ్ కూడా ఈ సినిమాలోనిదే అని తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అసలు బోయపాటి సినిమాలు అంటే ఆ రేంజ్ ఉండడంలో తప్పేలేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. త్వరలోనే ఆయన నటించియాన్ టైసన్ నాయుడు, హైందవ సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలతో బెల్లంకొండ బాబు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
ALSO READ:
Irumudi: ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు' సాంగ్ వచ్చేసింది
Obsession OTT: సడన్‌గా ఓటీటీకి.. అబ్సెషన్! యూత్‌ను ఆపడం కష్టమే