Obsession OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి.. అబ్సెషన్! యూత్‌ను ఆప‌డం క‌ష్ట‌మే

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:06 PM

గ‌త నెల‌లో అనామ‌కంగా థియేట‌ర్ల‌ల‌కు వ‌చ్చి ఇప్ప‌టికీ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్న ఆంగ్ల సాధించిన చిత్రం అబ్సెషన్.

Obsession OTT

గ‌త నెల‌లో అనామ‌కంగా థియేట‌ర్ల‌ల‌కు వ‌చ్చి ఇప్ప‌టికీ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తున్న ఆంగ్ల సాధించిన చిత్రం అబ్సెషన్ (Obsession). క‌ర్రీ బార్క‌ర్ (Curry Barker) స్వ‌యంగా ర‌చించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ఇండే నవారెట్ (Inde Navarrette), మైఖేల్ జాన్స్టన్ (Michael Johnston), కూపర్ టాంలిన్సన్, మేగన్ లాస్‌లెస్, ఆండీ రిక్టర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కేవ‌లం రూ.7 కోట్ల 8 ల‌క్ష‌ల వ్య‌యం ($750,000 డాల‌ర్లు)తో రూపొందిన ఈ సినిమా ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా $370 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి స్టిల్ ఇప్ప‌టికీ చాలా దేశాల్లో విజ‌య‌వంత‌గా ర‌న్ అవుతుంది. ముఖ్యంగా మే 15న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్ప‌టికే ఇండియాలోనే రూ.77 కోట్లు వ‌సూలు చేసి ఈ సంవ‌త్స‌రం హ‌య్య‌స్ట్ హాలీవుడ్ గ్రాస‌ర్‌గా నిలిచింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. మంచి టీనేజ్ వ‌య‌సులో ఉన్న బేర్‌ ఓ మ్యూజిక్ షాప్‌లో ప‌ని చేస్తూ ఉంటాడు. అంతేగాక అక్క‌డే ప‌ని చేసే నిక్కీ ఫ్రీమాన్‌ను వ‌న్ సైడ్ ల‌వ్ చేస్తుంటాడు. అయితే.. ఓ రోజు నిక్కీని ప్ర‌పోజ్ చేద్దామ‌ని ఓ షాప్‌లో వన్ విష్ విల్లో అనే ఒక వింత బొమ్మను కొంటాడు. ఈ బొమ్మ‌ను ప‌గ‌ల‌గొట్టి ఏదైనా కోరుకుంటే నెర‌వురుతుంద‌ని దానిపై వ్రాసి ఉంటుంది. ఇది చూసిన బారెన్ ఓ సంద‌ర్భంలో నిక్కీ త‌న‌ను మాత్ర‌మే ప్రేమించాల‌ని కోరుకుని ఆ బొమ్మ‌ను బ్రేక్ చేస్తాడు. దాంతో.. ఆ మ‌రుస‌టి క్ష‌ణం నుంచి ఆ కోరిక నెర‌వేరి నిక్కీ ఉన్న‌ప‌లంగా బేర్‌ను ప్రేమిస్తున్నాన‌ని చెప్పి అత‌నితో అత‌ని రూమ్‌కి వెళ్లిపోయి అక్క‌డే ఉంటుంది.

Obsession OTT

అప్ప‌టి నుంచి వారిరువురు క‌లిసే ఉంటూ అన్ని ప‌నులు కానిచ్చేస్తారు. కానీ క్ర‌మంగా రోజులు గ‌డుస్తున్న కొద్ది నిక్కీ ప్రేమ బేర్‌కు స‌రికొత్త త‌ల‌నొప్పి తెచ్చి పెడుతుంది. బేర్ అనుక్ష‌ణం త‌న వ‌ద్దే ఉండాల‌ని ప‌ట్టు బ‌డుతుంది. త‌న‌తో నిమిషం కూడా విడిచి ఉన్నా, ఇత‌రుల‌తో ఉన్నా తీవ్రంగా స్పందిస్తూ హ‌ద్దులు కూడా దాటుతూ ఉంటుంది.

ఓ సంద‌ర్భంలో క్రూరంగా మారి హ‌త్య‌లు చేసే వ‌ర‌కు వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో బేర్ ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది, ఆ సిట్యువేష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ్డాడా లేదా అనేది క‌థ‌. ఈ మూవీ జూన్ 30 నుంచి యాపిల్ టీవీ (apple tv) ఓటీటీలో కేవ‌లం ఇంగ్లీష్‌లో అన్‌క‌ట్ వ‌ర్ష‌న్‌ స్ట్రీమింగ్ అవ‌నుండ‌గా త్వ‌ర‌లోనే తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Obsession OTT

Updated Date - Jun 29 , 2026 | 12:18 PM