సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జటాయు.. ఆ హీరోలు చేయాల్సిందా

ABN, Publish Date - Nov 11 , 2026 | 07:15 PM

ఇండస్ట్రీలో ఒక హీరోకి చెప్పిన కథ వేరొక హీరో వద్దకు వెళ్ళడం సర్వ సాధారణమైన విషయమే. ఇలా ఎన్నో సినిమాలు చేతులు మారాయి. అలా చేతులు మారిన లిస్ట్ లో జటాయు కూడా చేరింది.

Roshan Meka

ఇండస్ట్రీలో ఒక హీరోకి చెప్పిన కథ వేరొక హీరో వద్దకు వెళ్ళడం సర్వ సాధారణమైన విషయమే. ఇలా ఎన్నో సినిమాలు చేతులు మారాయి. అలా చేతులు మారిన లిస్ట్ లో జటాయు (Jatayu) కూడా చేరింది. రామాయణ రిలీజ్ తరువాత జటాయు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. సీతమ్మని అపహరిస్తోన్న రావణుడితో పోరాడి..మరణించిన జటాయు సీన్స్ రామాయణకే హైలైట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు జటాయు టైటిల్ తోనే ఒక సినిమా రాబోతుంది. టాలీవుడ్ లో ఈ జటాయు స్క్రిప్ట్ గురించిన వార్తలు ఇప్పుడే కాదు.. ఎప్పటినుంచో నడుస్తున్నాయి. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti) ఈ మైథలాజికల్, విజువల్ వండర్‌ ని చాలామంది స్టార్ హీరోస్ కి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి.


అందుతున్న సమాచారం ప్రకారం మొదట జటాయు.. న్యాచురల్ స్టార్ నాని వద్దకు వెళ్ళిందట. నానిని అష్టా చమ్మా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఇంద్రగంటినే. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన జెంటిల్ మ్యాన్ సూపర్ హిట్ అందుకున్నా వి సినిమా మాత్రం దెబ్బకొట్టింది. ఇక చాలా గ్యాప్ తరువాత ఇంద్రగంటి.. నానితో జటాయు తీయాలని ప్లాన్ చేశాడు. కానీ, అది కుదరలేదు. నాని తప్పుకోవడంతో ఇదే కథతో విజయ్ దేవరకొండకి వినిపించడం, దిల్ రాజు నిర్మాణంలో భారీ పాన్-ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తీయాలని ప్లాన్ చేయడం జరిగిందట. అయితే కాల్ షీట్లు, బడ్జెట్ సమీకరణల కారణంగా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిందని టాక్.


ఇక పండే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అన్నట్లు.. జటాయు సినిమా మీద యంగ్ హీరో రోషన్ మేక పేరు రాసి ఉందని తెలుస్తోంది. సుమారు 18 నెలల పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులకు సమయం కేటాయించిన దర్శకుడు ఇంద్రగంటి, రోషన్‌ను ఈ భారీ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ రోల్ కోసం సిద్ధం చేశాడు. అశోకా క్రియేషన్స్ పతాకంపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్‌లో వైభవంగా లాంచ్ అయింది. ఈ చిత్రంలో రోషన్ సరసన రేఖ నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ గౌర హరి సంగీతం అందిస్తుండటం, ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్ లీ విట్టేకర్ యాక్షన్ సీన్స్‌ని డిజైన్ చేస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బిగ్ స్టార్స్ చేతులు మారి ఒక యంగ్ హీరోకి దక్కడం సినీ వర్గాల్లో ఆసక్తికరమైన పరిణామంగా మారగా, డిసెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 11 , 2026 | 07:20 PM