సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీఎం విజయ్ కొడుకు సినిమా.. అప్పుడే ఓటీటీకా

ABN, Publish Date - Oct 27 , 2026 | 05:23 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం సిగ్మా (Sigma). సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించగా లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

Sigma

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం సిగ్మా (Sigma). సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించగా లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎన్నో అంచనాల నడుమ సిగ్మా అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కొంతమంది రొటీన్ కథ అని, ఇంకొంతమంది టేకింగ్ అంతగా లేదని పెదవి విరిచారు. సిగ్మా ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం కూడా ఈ సినిమా పరాజయానికి ఒక కారణమని చెప్పవచ్చు.


కాగా, థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం తాజాగా తన ఓటీటీ విడుదల తేదీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 30న అన్ని భాషల్లో సిగ్మా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఖరారైంది. అయితే సీఎం విజయ్ కొడుకు సినిమా..నెల కూడా తిరక్కుండానే ఓటీటీలోకి రావడం చాలా చిత్రంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక సిగ్మా కథ విషయనికొస్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రేడియో హోస్ట్, ట్రెజర్ హంటర్ అయిన గురు (సందీప్ కిషన్), విన్సెంట్ అనే క్రిమినల్ నడుపుతున్న ఒక రహస్య జూదం స్థావరంలో అనుకోకుండా రూ. 500 కోట్ల సింథటిక్ డ్రగ్స్, మనీ లాండరింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన రహస్య పెన్ డ్రైవ్‌ను సంపాదిస్తాడు. ఆ పెన్ డ్రైవ్ కోసం అండర్ వరల్డ్ డాన్ కోట్లపట్టి వీరయ్య రెడ్డి, అతని ముఖ్య అనుచరుడైన ఎజిల్ ఈ నెట్‌వర్క్ ఆధారాలను వెలికితీసేందుకు గురు వెంటపడతారు. తన నమ్మకస్థులే తనను మోసం చేయడంతో ఒంటరివాడైన గురు, భయపడి పారిపోకుండా సరికొత్త లోన్ వోల్ఫ్ జనరేషన్ జెడ్ సిగ్మా మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటాడు. తన రేడియో సమయస్ఫూర్తి, తెలివితేటలతో పాటు ఆర్జే సామ్ (ఫరియా అబ్దుల్లా) కొంతమంది అండర్‌డాగ్స్ సాయంతో, వీరయ్య రెడ్డికి చెందిన అంతర్జాతీయ వెల్త్ లాకర్‌ను దోపిడీ చేసి ఆ నేర సామ్రాజ్యాన్ని ఎలా అంతమొందించాడు అనేదే ఈ సిగ్మా కథ. మరి థియేటర్ లో హిట్ కానీ, ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Oct 27 , 2026 | 05:28 PM