సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun - Tokyo: టోక్యోలో సుషీ రెస్టారెంట్‌.. బన్నీకి సడెన్‌ సర్‌ప్రైజ్‌..

ABN, Publish Date - Jan 25 , 2026 | 02:27 PM

పుష్ప-2: ది రూల్‌ చిత్రం ‘పుష్ప కున్రిన్‌’ (Pushpa Kunrin)టైటిల్‌తో ఈ నెల 16న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే! ఈ మేరకు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లారు. అభిమానులు కలిసి సరదాగా గడిపారు.

అల్లు అర్జున్‌ (allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప-2: ది రూల్‌ చిత్రం ‘పుష్ప కున్రిన్‌’ (Pushpa Kunrin)టైటిల్‌తో ఈ నెల 16న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే! ఈ మేరకు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లారు. అభిమానులు కలిసి సరదాగా గడిపారు. సినిమా విడుదల సందర్భంగా అక్కడి ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యారు. తాజాగా జాపన్‌లో బన్నీ ఫ్యాన్‌ చేసిన ఓ సర్‌ప్రైజ్‌ (Japan Fans surprise) ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య, పిల్లలతో కలిసి టోక్యోలోని సుషీ అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ రెస్టారెంట్‌ సిబ్బందకిఇ బన్నీకి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ పేరుతో పెద్ద కేకును, స్పెషల్‌ డిషెస్‌ తయారు చేసి బన్నీ ముందు ఉంచారు. సర్‌ప్రైజ్‌ అయిన బన్నీ అక్కడి సిబ్బందితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉంది. ఇటీవల లోకేశ్‌ కనకరాజుతో ఓ సినిమాను ప్రకటించారు. 


Updated Date - Jan 25 , 2026 | 02:32 PM