సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జనవరి 12 విడుదల’.. అనిల్ ఇవ్వబోతోన్న స్పెషల్ సర్‌ప్రైజ్ ఏంటి?

ABN, Publish Date - Aug 23 , 2026 | 05:00 PM

టాలీవుడ్‌లో వరుస విజయాలతో హిట్ మిషిన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘జనవరి 12 విడుదల’లో ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

January 12 Vidudala Latest Update

టాలీవుడ్‌లో వరుస విజయాలతో హిట్ మిషిన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’తో సంచలన విజయం సాధించిన అనిల్.. ఇప్పుడు రాబోయే పొంగల్ రేసు కోసం మరో క్రేజీ మల్టీస్టారర్‌ను సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే థియేటర్లలో నవ్వుల పండగ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అటు నందమూరి కళ్యాణ్ రామ్‌కు ‘పటాస్’ రూపంలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కూడా అనిల్ రావిపూడే. దీంతో వీరిద్దరి కాంబినేషన్లతో రాబోతోన్న ఈ మల్టీస్టారర్‌పై అభిమానులతో పాటు సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో అనిల్ తనదైన మార్క్ కామెడీ, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి అప్‌డేట్‌తో తన మార్క్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నారు.


ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘జనవరి 12 విడుదల’ పూర్తి స్థాయి బావాబావమరుదుల కథగా సాగనుందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లు బావాబావమరుదులుగా కనిపించబోతున్నారట. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు మాత్రమే కాకుండా, గుండెలను పిండేసే బలమైన ఎమోషనల్ సీన్లు కూడా ఉండబోతున్నాయట. ఈ ఎమోషనల్ అండ్ కామెడీ కెమిస్ట్రీనే సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనుందని చెప్తున్నారు. పైగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో అలరించబోతున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక మైండ్ బ్లోయింగ్ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. ఈ ప్రత్యేకమైన పాట కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఒక భారీ సెట్‌ను సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. విజువల్స్ పరంగా ఈ పాట గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పాట చిత్రీకరణను ప్రారంభించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మాస్ అండ్ ఎనర్జిటిక్ పాటలో హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు ఇద్దరు హీరోయిన్లు కూడా స్టెప్పులతో రచ్చ చేయబోతున్నారట. వీరితో పాటు మరో స్టార్ హీరోయిన్ కూడా ఇందులో భాగం అవుతుందని అంటున్నారు. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.


ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్, యంగ్ బ్యూటీ కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీత సంచలనం జీ.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి, వెంకీ, కళ్యాణ్ రామ్‌ల ఈ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

ఐకాన్ స్టార్ ‘రాకా’ చుట్టూ ఇంత రహస్యం ఎందుకు?

బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ విధ్వంసం.. 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే

Biopic Boom: బయోపిక్‌ల హవా.. తెరపైకి వస్తున్న సంచలన జీవితగాథలు!

Updated Date - Aug 23 , 2026 | 05:00 PM