Peddi: జాన్వీ చేసిన లైక్ ఎంత పని చేసిందంటే..
ABN, Publish Date - Jun 05 , 2026 | 03:52 PM
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కొట్టిన ఒక లైక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కొట్టిన ఒక లైక్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘పెద్ది’ (peddi) రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ అచ్చియమ్మగా కనిపించి మెప్పించింది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఓ సోషల్ మీడియా పేజ్ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చి ఓ పోస్ట్ పెట్టిది.
‘పెద్ది' భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్ లైన్‌తో జాన్వీ కపూర్ పాత్రకు ఇంపార్టెన్స్ దక్కలేదని రాశారు. ఈ పోస్ట్‌ను జాన్వీ లైక్ చేశారు. దాంతో ఒక్కసారిగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఆమె లైక్ చేశారంటే.. =అచ్చియమ్మ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని స్వయంగా సమర్థించారని కొందరు కామెంట్ చేశారు. మరి కొందరు జాన్వీ పొరపాటున లైక్ కొట్టి ఉంటారని అన్నారు. ఇదంతా సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఆ స్ర్కీన్‌షాట్‌లు వైరల్‌గా మారాయి.
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లలో జోరు చూపించింది. మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.135 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.