Janhvi Kapoor: ఈ సారి నన్ను.. ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు! జాన్వీ పాప.. తెలుగులో ఇరగదీసిందిగా
ABN, Publish Date - Jun 02 , 2026 | 09:51 AM
మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుందని జాన్వీ కపూర్ అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం విజయవాడలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, అభిమానమే మమ్మల్ని మరింత కష్టపడి పనిచేసేలాచేస్తుంది అన్నారు.
ఈ సినిమా నాకు చాలా స్పెషల్. మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు అంటే ఏమిటి? అనే అంశాలను ‘పెద్ది’ చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను అలరించడం, నటించడం, మంచి సినిమాలు చేయడం. నా గుర్తింపు కూడా మీ అందరితో ఎంతో బలంగా ముడిపడి ఉంది. మీరు నాపై చూపించిన ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరందరూ గర్వపడేలా మరిన్ని మంచి పనులు చేస్తానని మాటిస్తున్నా అని పేర్కొన్నారు.
ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా.. రామ్ చరణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన అద్భుతమైన నటుడు, గొప్ప వ్యక్తి. జై చరణ్ అని అన్నారు. బుచ్చిబాబు గారు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ దర్శకుల్లో ఒకరు. రెహమాన్ గారు ఒక లెజెండ్. మా నిర్మాత సతీష్ గారు ఈ మొత్తం ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ‘పెద్ది’ ఒక గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. మీరు తప్పకుండా బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాను ఆస్వాదిస్తారు. ఈ సారి నన్ను మీరు ఇంకొంచెం ఎక్కువగా చూస్తారు.