సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'రాకా'లో.. జాన్వీ కపూర్ క్రేజీ రోల్?

ABN, Publish Date - Aug 13 , 2026 | 02:49 PM

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' అనౌన్స్ అయినప్పటి నుంచే ఊహించని రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.

Janhvi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా'. ఈ ఇద్దరి కలయిక అనౌన్స్ అయినప్పటి నుంచే ఊహించని రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజుకో సంచలన వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు, వారి పాత్రల గురించి బయటకొస్తున్న లీక్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర గురించిన అప్‌డేట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సాధారణంగా అట్లీ సినిమా అంటేనే బిగ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. ఇక అల్లు అర్జున్‌తో ఆయన జతకడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది.

ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కేవలం ఒకే ఒక్క కథానాయిక కాకుండా ముగ్గురు భామలు నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా, మరొకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఇందులో జాన్వీ కపూర్ పాత్రపై ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఒక శక్తివంతమైన 'గిరిజన రాణి' పాత్రలో కనిపించబోతోందట. 'రాకా' కథా ప్రపంచంలో ఆమె క్యారెక్టర్ చాలా కీలకమని, కథను మలుపు తిప్పే విధంగా దానిని డిజైన్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 'పెద్ది' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న జాన్వీకి, ఈ గిరిజన రాణి పాత్ర కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోతుందంటున్నారు సినీ విశ్లేషకులు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా పురాణ కాలం నాటి ఒక రక్షకురాలి పాత్రలో మెరవనుందని సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా ప్రచారంలో ఉంది. 'రాకా' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రారంభంలో ఈ కథను సింగిల్ పార్ట్‌గానే అనుకున్నప్పటికీ, అట్లీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేసరికి కథా పరిధి ఊహించిన దానికంటే చాలా భారీగా పెరిగిపోయిందట. కథలోని ప్రతి పాత్రకు, ప్రతి ఎమోషన్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటే ఒక్క భాగం సరిపోదని మేకర్స్ భావించారట. అంతేకాకుండా, ఇందులో ఒక భాగం పూర్తిగా ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే... రెండో భాగం దానికి పూర్తి భిన్నంగా ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో ఉండబోతోందట. అయితే ఈ పాత్రలు, రెండు పార్టుల వార్తలలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ 'రాకా'తో అల్లు అర్జున్ - అట్లీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Aug 13 , 2026 | 03:19 PM