సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యో.. పాపం సమంత.. ఇప్పుడెలా తప్పించుకుంటుంది

ABN, Publish Date - May 24 , 2026 | 09:15 PM

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు.

Jana Naayagan

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సామ్ భర్త రాజ్ నిడిమోరు నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అన్ని బావుండి ఉంటే మేలోనే బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, ఐపీఎల్ కారణంగా బంగారం వాయిదా పడింది. దీంతో జూన్ 4 న పెద్ది.. జూన్ 26 లెనిన్ లాక్ చేసుకోవడంతో మధ్యలో వద్దామని జూన్ 19 డేట్ ని ఫిక్స్ చేసుకుంది సమంత.


అప్పటికీ పెద్ది రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతుంది.. లెనిన్ కి ఇంకో రెండు వారాలు ఉంటుంది. మధ్యలో సామ్ కి టైమ్ దొరకడంతో మంచి డేట్ పట్టేసింది బంగారం అనుకున్నారు. అంతేకాకుండా సింగిల్ డేట్ దొరకడంతో.. స్టార్ హీరోల సినిమాలు పోటీలేకుండా తప్పించుకుంది అని చెప్పొచ్చు. ఇక మొదట ప్రమోషన్స్ తో అమ్మడు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. కానీ, ఈసారి చాలా గట్టిగా ప్రమోషన్స్ చేయడానికి సామ్ సిద్దపడింది. అందులో భాగంగానే మే 25 న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.


ఇక సామ్ బంగారానికి ఎలాంటి సమస్యలు లేవు అనుకొనేలోపు జన నాయకుడు నేనున్నా అంటూ వస్తున్నాడు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో నెలలుగా సెన్సార్ సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. వాయిదాల మీద వాయిదాలు పడుతూ అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. విజయ్ సీఎం అయ్యాక కూడా ఈ సమస్యకి పరిష్కారం దక్కలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం జన నాయగన్ జూన్ 19 న రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది.


జూన్ 22 న విజయ్ పుట్టినరోజు కావడంతో.. జూన్ 19 న జన నాయగన్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమా తెలుగులో జన నాయకుడు అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇక అదే రోజు తెలుగులో మా ఇంటి బంగారం రిలీజ్ కి సిద్ధమవుతోంది. జన నాయకుడు రిలీజ్ కన్ఫర్మ్ అయితే కనుక సమంత- విజయ్ మధ్య గట్టి పోటీ ఉండనుందని చెప్పొచ్చు. జన నాయకుడు సినిమా కోసం అటు తమిళ్ తంబీలే కాదు తెలుగువారు కూడా ఎదురుచూస్తున్నారు. అందులో విజయ్ చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ లెక్కన్న బంగారానికి పోటీ తప్పదు. మరి ఈసారి సామ్ ఎలా తప్పించుకుంటుంది.. విజయ్ తో పోటీకి దిగుతుందా.. ? లేక ఆగిపోతుందా..? అనేది చూడాలి.

Updated Date - May 24 , 2026 | 09:35 PM