సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 3: జైలర్ 3లో నందమూరి బాలకృష్ణ.. రజనీకాంత్‌తో మాస్ కాంబో?

ABN, Publish Date - Oct 21 , 2026 | 01:26 PM

రజనీకాంత్ జైలర్ 3లో నందమూరి బాలకృష్ణ నటిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నెల్సన్ డైరెక్షన్‌లో బాలయ్య ఎంట్రీ, విజయ్ సేతుపతి విలన్ పాత్రపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Jailer, Balakrishna

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) తెరకెక్కించిన ‘జైలర్-2’ (Jailer 2) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జైలర్ మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టైందో మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చిన సీక్వెల్ కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.477 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ఈ సినిమా క్లైమాక్స్‌లో డైరెక్టర్ నెల్సన్ ‘జైలర్-3’ ఉంటుందంటూ ఒక అదిరిపోయే హింట్ ఇచ్చేశారు.

సినిమా చివరిలో రజనీకాంత్ అరెస్టయి పోలీస్ జీపు ఎక్కుతారు. ఆయన్ని తీసుకెళ్లే పోలీస్ ఆఫీసర్‌గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తళుక్కున మెరిసి థియేటర్లలో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు విద్యాబాలన్ క్యారెక్టర్ కూడా బతికే ఉంటుంది. అయితే, ‘జైలర్’లో మాదిరిగానే ‘జైలర్-2’లో కూడా చాలా క్యామియోలు ఉన్నప్పటికీ.. విజయ్ సేతుపతి ఉన్న విషయాన్ని మాత్రం మేకర్స్ చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు.

అయితే ఇది కేవలం ఒక చిన్న అతిథి పాత్ర మాత్రమే కాదని, ‘జైలర్’ ఫ్రాంఛైజీలో మరో సినిమాకు పడిన బలమైన పునాది అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్ట్-3 లో రజనీకి విజయ్ సేతుపతినే విలన్‌గా చూపించాలని నెల్సన్ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ ‘పేట’ సినిమాలో విజయ్ సేతుపతి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినప్పటికీ.. అది పూర్తి స్థాయి విలన్ క్లాష్ కాదు. మరి ఈసారైనా రజనీ, సేతుపతి మధ్య గట్టి పోరును స్క్రీన్ మీద చూసే అవకాశం దక్కుతుందేమో చూడాలి.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ‘జైలర్-2’ లో చేయాల్సిన ఒక కీలకమైన అతిథి పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ నందమూరి బాలకృష్ణ (Balakrishna)ను కలిసి చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఆ పాత్రకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉండటంతో బాలయ్య సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తన ఇమేజ్‌కు, స్థాయికి తగినట్టుగా నిడివి లేకపోవడమే ఆ ఆఫర్‌ను పక్కన పెట్టడానికి కారణమని తెలుస్తోంది.

అయినప్పటికీ.. ‘జైలర్-3’ లో మాత్రం బాలయ్య ఎంట్రీ పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ‘జైలర్-2’ లో ఇప్పుడు చేయకపోయినా, మూడో భాగంలో కచ్చితంగా నటిస్తానని బాలయ్య నెల్సన్‌కు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీ రేంజ్ చూశాక, బాలయ్య స్థాయికి తగినట్టుగా ఒక పవర్‌ఫుల్ మాస్ రోల్‌ను డిజైన్ చేసే పనిలో పడ్డాడట నెల్సన్. ఒకవేళ నిజంగానే రజనీకాంత్‌తో కలిసి బాలకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం.. థియేటర్లలో అభిమానులకు పూనకాలు రావాల్సిందే. రజనీ మాస్ యాక్షన్‌కి తోడు, విజయ్ సేతుపతి విలనిజం, అలాగే బాలయ్య ఎంట్రీ గనుక నిజమైతే ఇది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయం. మరి ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

Updated Date - Oct 21 , 2026 | 01:26 PM