ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్‌లో భారీ మార్పులు

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:38 PM

'హను-మాన్‌' మూవీ మొదటి భాగం వచ్చి ఏళ్లు గడుస్తున్నా... సీక్వెల్‌ సందడి కనిపించడం లేదు. ఆ మధ్య గ్రాండ్‌గా ఓపెనింగ్‌ జరిగింది కానీ మళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. బట్‌ తాజాగా ఊహించని మార్పు ఒకటి చోటు చేసుకోవడంతో ఈ సీక్వెల్ మరోసారి వార్తల్లోకెక్కింది.

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న హైలీ అంటిసిపేటెడ్ సీక్వెల్ 'జై హనుమాన్'. మైథలాజికల్ ఎపిక్ 'హను-మాన్'గా కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమాలు ఫిబ్రవరి మాసంలో హంపిలో గ్రాండ్‌గా జరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జరిగిపోతోంది. 'హను-మాన్‌' భారీ విజయం సాధించడంతో ఈ సీక్వెల్ పై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినిమా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.


'జై హనుమాన్‌'లో రిషబ్ శెట్టి హనుమంతుడు గా కనిపించనున్నాడు. ఇప్పటికే బయటకు మేకర్స్ రిలీజ్ చేసిన ఆ లుక్ హైప్‌ను క్రియేట్ చేసింది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం నేపథ్యంలో 'జై హనుమాన్‌' మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా టెక్నికల్‌ టీమ్‌లో ఓ కీలక మార్పు జరిగింది. 'హను-మాన్‌' సినిమాకు శివేంద్ర దాశరథి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. అయితే సీక్వెల్ దగ్గరకు వచ్చే సరికీ ప్రశాంత్ వర్మ ఎస్‌. తిరునావుక్కరసు ను సినిమాటోగ్రాఫర్ గా ఎంపిక చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే సరికీ ఆయన స్థానంలోకి 'లక్కీ భాస్కర్' ఫేమ్ నిమిష్ రవి వచ్చారు. ఆయనిప్పుడీ సినిమాకు డీఓపీగా ఉన్నారు. అలానే సంగీత దర్శకుడిగా 'హను-మాన్'కు గౌర హరి వ్యవహరించగా, ఇప్పుడీ సీక్వెల్ కు ఎం. ఎం. కీరవాణి స్వరరచన చేస్తున్నారు. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇందులో తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా, రానా దగ్గుబాటి కూడా ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను ప్రకటించాల్సి ఉంది.

Read Also: ఆసక్తికరంగా ‘గాయపడ్డ సింహం’ గ్లింప్స్

Read Also: ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ నటి సూసైడ్

Updated Date - Apr 06 , 2026 | 07:21 PM