రోడ్డున పడ్డ అప్పలసూరి..
ABN, Publish Date - Jun 03 , 2026 | 04:51 PM
పెద్ది (Peddi).. పెద్ది.. పెద్ది.. ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. జూన్ 3 రాత్రి ప్రీమియర్స్ పడడంతోనే పెద్ది టైమ్ స్టార్ట్ అవుతోంది. రామ్ చరణ్ (Ram Charan) హిట్ అందుకున్నాడా.. ? లేదా.. ? అనేది తెలిసిపోతోంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు.
పెద్ది (Peddi).. పెద్ది.. పెద్ది.. ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. జూన్ 3 రాత్రి ప్రీమియర్స్ పడడంతోనే పెద్ది టైమ్ స్టార్ట్ అవుతోంది. రామ్ చరణ్ (Ram Charan) హిట్ అందుకున్నాడా.. ? లేదా.. ? అనేది తెలిసిపోతోంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. రామ్ చరణ్ ఎన్నో గాయాలపాలయ్యాడు. ఇక పెద్ది సినిమాకు ప్రాణం అంటే అప్పలసూరి అని మొదటినుంచి చెప్పుకొస్తున్నారు. జగపతిబాబు (Jagapathi Babu) ఆ పాత్రలో నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పొచ్చు.
రంగస్థలం తరువాత జగ్గూభాయ్ చేస్తోన్న ఎంతో మంచి పాత్ర అప్పలసూరి. ఇక ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అసలు ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. 70 ఏళ్ళ వృద్ధుడిగా.. వంగిపోయి.. ఎంతో బాధతో ఉన్నట్లు ఆ పోస్టర్ లో కనిపించారు. దీనికోసం ఆయన ఎంత కష్టపడ్డారో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు జగ్గూభాయ్. ఈ వీడియోలో అప్పలసూరిగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన జగపతిబాబు అని ఎవరు గుర్తుపట్టలేదు. అప్పలసూరిగా మారిన తరువాత జగపతిబాబు రోడ్డు మీదకు వెళ్ళి నడిచినా.. టీ తాగినా ఎవరు గుర్తుపట్టలేదు.
ఇక ఆ మేకింగ్ వీడియోను జగపతిబాబు పోస్ట్ చేస్తూ అప్పలసూరి రోడ్డున పడినా కూడా ఎవరు గుర్తుపట్టలేదు అని క్యాప్షన్ ఇచ్చారు. ఒక స్టార్ నటుడిని పక్కన ఉన్నవాళ్లు కూడా గుర్తుపట్టలేదంటే మేకప్ టీం, డైరెక్టర్ బుచ్చిబాబు క్యారెక్టర్ ని ఏ రేంజ్‌లో చెక్కారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పెద్ది తరువాత అప్పలసూరి ప్రేక్షకుల మైండ్ లో నుంచి పోడు అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.