పెద్దిని మలుపు తిప్పేది ఆయనేనట..
ABN, Publish Date - May 12 , 2026 | 07:00 PM
ఏ సినిమాలోనైనా మలుపులు ఉండకపోతే ఎక్కువసేపు చూడబుద్దికాదు. అందుకే డైరెక్టర్స్.. అలా కథను మలుపు తిప్పడానికి ఒక క్యారెక్టర్ ని రాసుకుంటారు. ఆ క్యారెక్టర్ పండితే సినిమా హిట్ అయ్యినట్టే. తాజాగా పెద్ది (Peddi)లో అలాంటి క్యారెక్టరే అప్పల సూరి అని టాక్ నడుస్తోంది.
ఏ సినిమాలోనైనా మలుపులు ఉండకపోతే ఎక్కువసేపు చూడబుద్దికాదు. అందుకే డైరెక్టర్స్.. అలా కథను మలుపు తిప్పడానికి ఒక క్యారెక్టర్ ని రాసుకుంటారు. ఆ క్యారెక్టర్ పండితే సినిమా హిట్ అయ్యినట్టే. తాజాగా పెద్ది (Peddi)లో అలాంటి క్యారెక్టరే అప్పల సూరి అని టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పెద్ది. జగపతి బాబు, శివన్న, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత జూన్ 4 న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన మేకర్స్ మే 18 న ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టారు.
ఇక ట్రైలర్ విషయం పక్కన పెడితే.. పెద్దిలో అప్పలసూరి పాత్ర కీలకమని, ఆ పాత్రనే సినిమాను మలుపు తిప్పుతోందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పలసూరి పాత్రలో జగపతిబాబు నటించాడు. ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అసలు ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తెల్లబడిన జుట్టు, వడిలిపోయిన దేహం, ముఖంలో అసహనంతో కనిపించిన ఈ అప్పలసూరిని చూసి అందరూ షాక్ అయ్యారు. జగపతిబాబు రంగస్థలంలో ప్రెసిడెంట్ క్యారెక్టర్ కంటే దారుణంగా పెద్దిలో కనిపించనున్నాడని అనుకున్నారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం అప్పలసూరి పాత్ర కథనే మార్చేస్తుందంట. పెద్దికి దిశా నిర్దేశం చేస్తూ అతని లక్ష్యం వైపు అడుగులు వేయించేలా చేసే పాత్రలో జగ్గూభాయ్ కనిపించనున్నాడట.
అంతేకాకుండా ఇంటర్వెల్ ఫైట్ కి దారితీసేది కూడా ఈ పాత్రనే అని చెప్పుకొస్తున్నారు. ఈ లెక్కన్న రంగస్థలం తరువాత మరో అద్భుతమైన పాత్రలో జగపతిబాబు నటించాడని తెలుస్తోంది. దీంతో ఈ పాత్రపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇది కూడా క్లిక్ అయితే జగ్గూభాయ్ కెరీర్ లో ఇంకో మైలురాయిగా పెద్ది నిలుస్తోందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.