సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వదలా’ అంటున్న జగపతిబాబు

ABN, Publish Date - Mar 10 , 2026 | 08:18 AM

జగపతిబాబు (Jagapathi Babu) ప్రధాన పాత్ర పోషిస్తున్న మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వదలా’.

Jagapathi Babu

జగపతిబాబు (Jagapathi Babu) ప్రధాన పాత్ర పోషిస్తున్న మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వదలా’. ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో కిశోర్‌నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి జగపతిబాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

నల్ల కళ్లద్దాలు ధరించిన జగపతిబాబు, బ్యాక్‌డ్రాప్‌లో నీలం.. ఎరుపు రంగుల మధ్య విభజించిన ఓ యువతి ముఖం.. ఈ పోస్టర్‌లో కనిపించి సినిమా మీద ఆసక్తిని పెంచాయి.

త్వరలోనే విడుదలయ్యే ఈ చిత్రంలో లయ, హృతిక ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘వదలా’ చిత్రానికి రచన: లక్ష్మీ భూపాల, సంగీతం: కార్తీక్‌ బి కొడకండ్ల, ఛాయాగ్రాహణం: చోటా కె నాయుడు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

Updated Date - Mar 10 , 2026 | 11:57 AM