సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

జగపతిబాబు సంచలన నిర్ణయం..

ABN, Publish Date - Jul 04 , 2026 | 03:46 PM

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని మోస్ట్ గ్లామరస్ అండ్ స్టైలిష్ హీరోగా జగపతిబాబు(Jagapathi Babu) ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. పెద్దరికం, గాయం, శుభలగ్నం, మావిచిగురు, అంతఃపురం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఆయన మహిళా ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Jagapathi Babu

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని మోస్ట్ గ్లామరస్ అండ్ స్టైలిష్ హీరోగా జగపతిబాబు(Jagapathi Babu) ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. పెద్దరికం, గాయం, శుభలగ్నం, మావిచిగురు, అంతఃపురం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఆయన మహిళా ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా ఏ జానర్ అయినా తనదైన శైలిలో నటిస్తూ దశాబ్దాల పాటు సోలో హీరోగా టాలీవుడ్‌లో చక్రం తిప్పారు.అయితే కాలక్రమేణా హీరోగా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో, కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న జగపతిబాబు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.


ఇక ఈ క్రమంలోనే దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ చిత్రంతో ఆయన విలన్‌గా మారి టాలీవుడ్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. జగ్గుభాయ్ లోని నయా విలనిజం, ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఊహించని మలుపు తిరిగింది. అక్కడి నుంచి నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, రంగస్థలం, సలార్ వంటి ఎన్నో భారీ చిత్రాలలో పవర్‌ఫుల్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయారు.


ఇలా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్రలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న తరుణంలోనే మరోసారి జగ్గుభాయ్ హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోరు. కానీ, జగపతి బాబు మాత్రం వదులుకున్నారు. ఇటీవల ఒక దర్శకుడు ఆయన కోసం ఒక ప్రత్యేకమైన లీడ్ క్యారెక్టర్ కథను సిద్ధం చేసుకుని వెళ్లారట. మెయిన్ హీరోగా మీరైతేనే ఈ కథకు న్యాయం చేయగలరని సదరు దర్శకుడు ఎంత బతిమాలినా, జగపతిబాబు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తనకు మళ్లీ సోలో హీరోగా స్క్రీన్ పైన కనిపించే ఉద్దేశం అస్సలు లేదని, ఇప్పుడు తను చేస్తున్న విలన్ మరియు వైవిధ్యమైన పాత్రలతోనే ఎంతో సంతృప్తిగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు. హీరోగా కంటే ఒక నటుడిగా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలు చేయడమే తనకు ఇష్టమని చెప్పి జగ్గుభాయ్ చెప్పారట. ఏదిఏమైనా ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అభినందనీయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ట్రోల్ కాకుండా.. వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోమని సలహాలు ఇస్తున్నారు.

Updated Date - Jul 04 , 2026 | 03:52 PM