Sunil: నీ ముఖం అద్దంలో చూసుకున్నావా.. నువ్వు హీరోవా
ABN, Publish Date - May 10 , 2026 | 04:05 PM
జర్నలిస్ట్ జాఫర్ (Jaffar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ గానే కాకుండా యాంకర్ గా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు.
జర్నలిస్ట్ జాఫర్ (Jaffar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జర్నలిస్ట్ గానే కాకుండా యాంకర్ గా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీరాజకీయ ప్రముఖలను ఇంటర్వ్యూ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడంలో జాఫర్ ముందు ఉంటాడు. జాఫర్ ఇంటర్వ్యూ చేశాడు అంటే ఖచ్చితంగా అది వివాదంగా మారాల్సిందే అని చెప్పొచ్చు. ప్రస్తుతం జాఫర్ వివాదాల జోలికి పోవడం లేదు. తాజాగా ఆయన సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), విష్ణుప్రియ హోస్ట్ చేస్తోన్న సర్కార్ షోకు వచ్చాడు. అక్కడ తన లైఫ్ లో ఎదుర్కొన్న వివాదాల గురించి మాట్లాడాడు.
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సునీల్ హీరోగా మారిన సమయంలో తాను చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద కాంట్రవర్సీకి దారి తీశాయని, దానివలన టాలీవుడ్ తనను బ్యాన్ చేసినట్లు తెలిపాడు. 'ఒక ఇంటర్వ్యూలో సునీల్ ని ఒక ప్రశ్న అడిగాను. నువ్వు హీరో మెటీరియలా.. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని, దానికి ఆయన చాలా సీరియస్ అయ్యాడు. నా ఉద్దేశ్యం అతడిని అవమానించడం కానే కాదు. కానీ, అది పెద్ద ఇష్యూ అయ్యిపోయింది. ఏడాది పాటు నాతో ఎవరు ఇంటర్వ్యూలు చేయలేదు' అని తెలిపాడు.
ఇక సునీల్ విషయానికి వస్తే, కమెడియన్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన అందాల రాముడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. అయితే కథలను మంచిగా ఎంచుకోలేక సునీల్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ రోల్స్‌లో మంచి గుర్తింపు పొందుతున్నారు. మొత్తానికి, అప్పట్లో పెద్ద వివాదంగా మారిన ఈ విషయం గురించి జాఫర్ తాజాగా స్పందించడంతో హాట్ టాపిక్ గా మారింది.